విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడే ఎన్నిక‌ల క్యాబినెట్‌: ప‌్ర‌జాక‌ర్షక నిర్ణ‌యాల‌కు ఆమోదం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019 : AP Elections Cabinet Meet Key Decisions May Announce | Oneindia Telugu

ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. ఎన్నిక‌ల కోసం తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీల‌క స‌మావేశం ఈ రోజు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన పెన్ష‌న్ల పెంపు తో పాటుగా డ్వాక్రా మ‌హి ళ‌ల‌కు నిధులు..సెల్ ఫోన్ల‌తో పాటుగా రైతుల‌కు సంబంధించి రైతు ర‌క్ష పేరిట ఓ వినూత్న ప‌ధ‌కానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది.

జ‌న‌సేన స‌భ‌లో జై జ‌గ‌న్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట‌: హైప‌ర్ ఆది కారు పై దాడి..! జ‌న‌సేన స‌భ‌లో జై జ‌గ‌న్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట‌: హైప‌ర్ ఆది కారు పై దాడి..!

ఎన్నిక‌ల తాయిలాలు..

ఎన్నిక‌ల తాయిలాలు..

ఈ నెలాఖ‌రు నుండి ఏపి ప్ర‌భుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది. వ‌చ్చే నెల లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో..ఎన్నిక‌ల వ‌రాల కోసం ప్ర‌భుత్వం కొత్త తాయి లాల ద్వారా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిలో భాగంగా..ఏపి మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశం లో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెల‌ప‌నుంది.

మ‌హిళ‌లు..ఉద్యోగులు..అగ్రిగోల్డ్ బాధితుల కు అండ‌గా

మ‌హిళ‌లు..ఉద్యోగులు..అగ్రిగోల్డ్ బాధితుల కు అండ‌గా

రైతులు..మ‌హిళ‌లు..ఉద్యోగులు..అగ్రిగోల్డ్ బాధితుల కు అండ‌గా ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనుంది. రైతుల‌కు సంబంధింది 1.52 ఓట్ల రైతు కుటుంబాల‌కు మేలు చేసేలా ఓ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని క్యాబినెట్ చర్చించి..ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. రైతు రుణ విముక్తి తో పాటు గా కౌలు రైతుల‌కు ల‌బ్ది చేకూర్చేలా.. రైతుల ఖాతాల్లోకి సొమ్ము జ‌మ అయ్యేలా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు స‌మా చారం. ఈ స‌మావేశంలో దీని పై సుదీర్ఘంగా చ‌ర్చించి..ఓ నిర్ణ‌యానికి రానున్నారు.

మ‌హిళ‌లు..ఉద్యోగుల‌ను ఆకట్టుకొనేలా..

మ‌హిళ‌లు..ఉద్యోగుల‌ను ఆకట్టుకొనేలా..

ఆటోలు..ట్రాక్ట‌ర్ల లైఫ్ టాక్స్ ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేయ నుంది. ఇక‌, ఇప్ప‌టికే పెన్ష‌న్ల‌ను రెండు వేల‌కు పెంచుతూ ముఖ్య‌మంత్రి ప్ర‌కటించారు. ఆ నిర్ణ‌యానికి క్యాబినెట్ అధి కారికంగా ఆమోద ముద్ర వేస్తుంద‌ని స‌మాచారం . ఇక డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇప్ప‌టికే ఆర్దిక చేయూత కింద ఒక్కో స‌భ్యు రాలికి ప‌ది వేల చొప్పున చెల్లించారు. మరో సారి ఒక్కో స‌భ్యురాలికి ప‌ది వేల చొప్పున మూడు విడ‌త‌లుగా చెల్లించే వి ధంగా క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకోనుంది. దీంతో పాటుగా ఉద్యోగుల‌కు బ‌కాయి ఉన్న డిఏ విడుద‌ల‌..వారికి సొంతిళ్ల కోసం ఓ విధాన ప‌ర‌మైన ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఈ నెల 30 నుండి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గున్నా యి. ఈ స‌మావేశాల్లోనూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకొనే అవ‌కాశం ఉంది. మొత్తంగా ఏపి ప్ర‌భుత్వం ఈ రోజు జ‌రిగే క్యాబినెట్ స‌మావేశం ద్వారా ఎన్నిక‌ల స‌మ‌ర‌శంకం పూరించ‌నుంది.

English summary
AP Cabinet meet to day to take key decisions. To attract different sections of people in coming elections ap govt may announce Farmer- Women- Employees welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X