విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ‌స‌వ తార‌కం స్వ‌గ్రామం : భువ‌నేశ్వ‌రి ద‌త్త‌త : నారా దేవాన్ష్ కాల‌నీ..!

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ స‌తీమ‌ణి స్వ‌గ్రామం అది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌తీమ‌ణి..ఎన్టీఆర్ కుమార్తు ఆ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకు న్నారు. ఆ గ్రామంలో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు చొర‌వ చూపించారు. ఆ గ్రామంలో పేద‌ల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప‌ధ‌కం లో భాగంగా కాల‌నీ ఏర్పాటైంది. ఆ కాల‌నీకి ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డు దేవాన్ష్ కాల‌నీగా పేరు పెట్టారు.

కొమ‌ర‌వోలు..భువ‌నేశ్వ‌రి ద‌త్త‌త‌

కొమ‌ర‌వోలు..భువ‌నేశ్వ‌రి ద‌త్త‌త‌

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200 గా ఉంది. ఎన్టీఆర్‌ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించటం తో త‌ల్లి మీద ప్రేమ తో ఈ గ్రామాన్ని అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించారు.

భువ‌నేశ్వ‌రి

భువ‌నేశ్వ‌రి

పలు దఫాలు గా గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల తోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. భువ‌నేశ్వ‌రి చొరవ తో ఆ గ్రామంలో అభివృద్ది ప‌నులు పరుగులు పెట్టాయి. ఇప్పుడు ఆ గ్రామస్తులు సైతం భువ‌నేశ్వ‌రిని అభినందిస్తున్నారు. ఆమె చొర‌వ తోనే అభివృద్ది సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు.

హౌసింగ్ కాల‌నీకి దేవాన్ష్ పేరు..

హౌసింగ్ కాల‌నీకి దేవాన్ష్ పేరు..

కొమ‌ర‌వోలు లో అభివృద్ది కి దృష్టి పెట్ట‌ని భువ‌నేశ్వ‌రి..ముఖ్య‌మంత్రి చంద్రబాబు తో క‌లిసి ఆ గ్రామంలో ప‌ర్య‌టించా రు. గ్రామ‌స్థుల అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ ఉన్న బంధువులు సైతం అక్క‌డికి చేరుకున్నారు. అయితే, ఇదే గ్రామంలో పేద‌ల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప‌ధ‌కం లో భాగంగా కాల‌నీ ఏర్పాటైంది. ఆ కాల‌నీకి ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డు దేవాన్ష్ కాల‌నీగా పేరు పెట్టారు.

English summary
Government named Komaravolu housing colony as Devansh Colony. Now this decision became topic in Krishna dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X