Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల స్మగ్లింగ్ .. దోపిడీలో జగన్ దారే వేరయా : అయ్యన్న ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు మరో ఆయుధం దొరికింది. తాజాగా తిరుమల శ్రీవారికి భక్తులు అత్యంత భక్తి భావంతో సమర్పించిన తలనీలాలు అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. మిజోరం సరిహద్దుల్లో ఓ ట్రక్కు నిండా మయన్మార్ బోర్డర్ నుంచి చైనాకు స్మగ్లింగ్ చేస్తుండగా సరిహద్దుల్లో కాపలా కాసే అస్సాం రైఫిల్ సిబ్బంది ఈ తలనీలాల వాహనాన్ని పట్టుకున్నారు . దీంతో ఇప్పుడు తిరుమల శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్ ఏపీలో దుమారంగా మారింది.

అక్రమంగా ఇతర దేశాలకు తరలుతున్న స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు

అక్రమంగా ఇతర దేశాలకు తరలుతున్న స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నలలోనే అక్రమంగా శ్రీవారి తలనీలాలు ఇతర దేశాలకు తరలుతున్నాయని టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతున్నారు. తిరుమల శ్రీవారికి చెందిన తలనీలాలను అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుండగా పట్టుకున్న వార్తలపై స్పందించిన ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.

 దోపిడీలో ఆయన దారే వేరయా! అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

దోపిడీలో ఆయన దారే వేరయా! అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

ఆఖరికి జుట్టు కూడా వదలడంలేదు జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ : అయ్యన్న

ఆఖరికి జుట్టు కూడా వదలడంలేదు జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ , పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న భక్తులు సమర్పించే తలనీలాలను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు జగన్ అండ్ కో అంటూ అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. అక్రమంగా తిరుమల శ్రీవారికి చెందిన తలనీలాలు ఇతర దేశాలకు తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పోలీసులు పట్టుకున్నారని, మొదటి మయన్మార్, అక్కడినుండి థాయిలాండ్ మీదుగా చైనాకు శ్రీవారి తలనీలాలు తరలిస్తున్నారని అక్కడి అధికారులు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు .

 పట్టుకున్నది సుమారు 2 కోట్ల విలువైన తలనీలాలు.. ఇంకెన్ని కోట్ల స్మగ్లింగ్ జరుగుతుందో

పట్టుకున్నది సుమారు 2 కోట్ల విలువైన తలనీలాలు.. ఇంకెన్ని కోట్ల స్మగ్లింగ్ జరుగుతుందో

ఇప్పుడు పట్టుకున్నది సుమారు 2 కోట్ల విలువైన తలనీలాలు అంటే ప్రతిరోజూ శ్రీవారికి చెందాల్సిన ఎన్ని కోట్లు జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కొట్టేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

సహజంగా శ్రీవారి తలనీలాలు ఈ వేలం వేస్తారు . శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల మీదనే ప్రతి ఏటా 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది . ఎక్కువగా విదేశీ సంస్థలే శ్రీవారి తలనీలాలు కొంటూ ఉంటాయి . అధికారికంగా కొనుగోలు చేసి తరలించే అవకాశం ఉన్న చోట, ఇలా అక్రమంగా శ్రీవారి తలనీలాలు తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా , అధికార పార్టీకి తలనొప్పిగా తలనీలాల స్మగ్లింగ్

ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా , అధికార పార్టీకి తలనొప్పిగా తలనీలాల స్మగ్లింగ్

అసలు ఇంతకీ శ్రీవారి తలనీలాలను అక్రమంగా తరలిస్తున్న వారెవరు? టిటిడి బోర్డు కనుసన్నలలోనే అన్నీ జరగాల్సి ఉండగా స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ వారికి తెలియకుండా సాధ్యమవుతుందా ? కోట్ల రూపాయల ఖరీదు చేసే స్వామివారికి సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్నది ఎవరు ? అన్న అనుమానాలు ప్రస్తుతం తాజా వార్తల నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి తలనొప్పి కాగా , ప్రతిపక్ష పార్టీకి మరో ఆయుధం దొరికినట్లయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+