విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి హాట్సాఫ్...!!

|
Google Oneindia TeluguNews

ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెడుతూ... తీసుకున్న నిర్ణయం కొంత వివాదం చెలరేగిన విషయం తెలిసిందే...అయితే ఇదే విషయమై ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి హాట్సాఫ్ చెప్పారు. ఇంగ్లీష్‌ను మాద్యమాన్ని ప్రవేశపెట్టడడాన్ని ఆయన స్వాగతించారు.

 సీఎం జగన్ అక్రమార్జనపై ఫిర్యాదు: ప్రభుత్వ కాల్ సెంటర్ కు ఫోన్: 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ..! సీఎం జగన్ అక్రమార్జనపై ఫిర్యాదు: ప్రభుత్వ కాల్ సెంటర్ కు ఫోన్: 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ..!

వ్యతిరేకిస్తున్న వారికి చురకలు

వ్యతిరేకిస్తున్న వారికి చురకలు

ఇంగ్లీష్‌ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలకు కూడ ఆయన చురకలు అంటించారు. తెలుగు బాషను కాపాడామని చెబుతున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారని , వాళ్లు మాత్రం వారి పిల్లలను ఇంగ్లీష్ మీడీయంలో చదివిస్తున్నారని అన్నారు. మరోవైపు తమ హయాంలో ఇంగ్లీష్ విద్యను అభ్యసించినవారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతుండగా... తెలుగు మీడియం చదివిన బడుగు బలహీన వర్గాలు మాత్రం క్రిందిస్థాయి ఉద్యోగులు అయ్యారని అన్నారు.

సీఎం నిర్ణయంపై సానుకూల నిర్ణయాలు

సీఎం నిర్ణయంపై సానుకూల నిర్ణయాలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యపై తీసుకున్న కీలక నిర్ణయంపై ఇటివల సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈనేపథ్యంలోనే రానున్న విద్యా సంవత్సరం నుండే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు భాష అభిమాన సంఘాలు, కొంతమంది మేధావులు వ్యతిరేకించారు. కాని ప్రభుత్వం మాత్రం విమర్శలను పట్టించుకోకుండా వచ్చే సంవత్సరం నుండి 1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ విద్యను అమలు చేయబోతున్నట్టు ఈనెల 20న జీవో కూడ జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక అధికారిని కూడ నియమించింది.

యూ టర్న్ తీసుకున్న పవన్ కళ్యాన్

యూ టర్న్ తీసుకున్న పవన్ కళ్యాన్


మరోవైపు ఇంగ్లీష్ విద్యపై ఇటివల పవన్ కళ్యాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇంగ్లీష్ విద్యను పూర్తిగా వ్యతిరేకించిన పవన్ కళ్యాన్ తెలుగును కాపాడుకుంటూనే ఇంగ్లీష్ విద్యను బోధించాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఇంగ్లీష్ విద్య అమలు నిర్ణయం తీసుకోవడంతో జగన్ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టిన నేతలు సైతం ఎలాంటీ ఆందోళనలు లేకుండా ప్రభుత్వ అనుకూల ప్రకటనలతో ఇంగ్లీష్ విద్యకు పలువురు స్వాగతం పలుకుతున్నారు.

మద్దతు పలికిన కంచె అయిలయ్య

మద్దతు పలికిన కంచె అయిలయ్య

దళిత బహుజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రోఫెసర్ కంచె అయిలయ్య సైతం స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మాత్రం తెలుగు కనుమరుగు అవుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు సంపన్నులు ఉండే నివాసాల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకున్నప్పుడు తెలుగు ఎందుకు చనిపోలేదని ఆయన అడిగారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సైతం రాజకీయంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతును తీసుకువ
స్తుంది.

English summary
Welcome to the English language and hats off to c.m jaganmohan reddy said prominent film actor R.Narayana murthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X