జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ప్రత్యేకంగా ముర్ముకు పరిచయం చేసిన వైఎస్ జగన్

విజయవాడ: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం వైఖరి ఏమిటో స్పష్టమైంది. ఈ రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి నిలబెట్టిన ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాయి. వివిధ పార్టీల మద్దుతును కూడగట్టుకోవడానికి విజయవాడకు వచ్చిన ఆమెను కలిసి.. మరీ తాము అండగా ఉంటామని స్పష్టం చేశాయి. ఈ నెల 18వ తేదీ నిర్వహించబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ముర్ముకు అనుకూలంగా ఓటు వేయడం ఇక లాంఛనప్రాయమే.

రాజ్యసభ, లోక్‌సభతో కలిసి వైఎస్ఆర్సీపీకి ఉన్న సభ్యుల సంఖ్య 31. టీడీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మాత్రమే ప్రాతినిథ్యం ఉంది. వీరందరూ ద్రౌపది ముర్ముకు ఓటు వేయనున్నారు. శాసనసభలో వైసీపీకి చెందిన 151 సభ్యులు ముర్ముకే ఓటు వేయాల్సి ఉంటుంది. టీడీపీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న 23 మందీ ఆమె వైపే మొగ్గు చూపారు. వేర్వేరు కార్యక్రమాల్లో ముర్ముకు ఈ రెండు పార్టీలు కూడా తమ మద్దతును ప్రకటించాయి.

Jana Sena MLA Rapaka Vara Prasad meets Draupadi Murmu along with YSRCP representatives

ఇక మిగిలిన ఒక్క సభ్యుడు రాపాక వరప్రసాద్. ఆయన- పవన్ కల్యాణ్ సారథ్యం వహిస్తోన్న జనసేనకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. తమకు ఉన్నది ఒక్క శాసనసభ్యుడే కావడం, పైగా ఆయన అనధికారికంగా వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నందు వల్- రాష్ట్రపతి ఎన్నికలపై జనసేన ఏ మాత్రం దృష్టి సారించలేదు. ఆ విషయాన్ని దాదాపుగా పట్టించుకోలేదనే చెప్పుకోవచ్చు.

Jana Sena MLA Rapaka Vara Prasad meets Draupadi Murmu along with YSRCP representatives

ఈ పరిస్థితుల మధ్య రాపాక వరప్రసాద్.. ద్రౌపది ముర్మను కలిశారు. ఆమెకు తన మద్దతును తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి రాపాక హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను వైఎస్ జగన్ ప్రత్యేకంగా- ద్రౌపది ముర్ముకు పరిచయం చేశారు. ఆ సమయంలో రాపాక భుజంపై చేతులు వేసి ఆప్యాయంగా ఆయన గురించి ముర్ముకు వివరించడం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+