సీఎం జగన్‌ను తప్ప... పవన్ కళ్యాన్, ఎవర్ని ప్రశ్నించలేడు : మంత్రి పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ప్రశ్నించడం తప్ప ఇతరులెవరిని ఆయన ప్రశ్నించడని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్నీ నాని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడ జగన్‌నే విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడుతో లాలూచీపడి సీఎం జగన్‌మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని దుయ్యపట్టారు.

జగన్‌ను తప్ప పవన్ ఎవరిని ప్రశ్నించలేడు

జగన్‌ను తప్ప పవన్ ఎవరిని ప్రశ్నించలేడు

ఇటివల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇసుకపాలసీ విధానంపై పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానంవల్లే ఈదుస్థితి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే ఇసుక విధానమే ప్రభుత్వ పతనానికి నాందీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజధాని నిర్మాణంపై కూడ ఆయన తన స్వరాన్ని పెంచారు. దీంతో పవన్ కళ్యాణ్ విమర్శలను వైఎస్ఆర్‌సీపీ నేత, మంత్రి పేర్నీ నాని కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు జగన్‌ను ప్రశ్నించడం తప్ప ఇంక ఎవరిని ప్రశ్నించలేడని ఎద్దెవా చేశారు.

ఏకేసులు లేని పవన్ ఏం సాధించాడు...

ఏకేసులు లేని పవన్ ఏం సాధించాడు...

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై కేసులు ఉండడం వల్లే కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారని పవన్ కళ్యాన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే నాని వాటిని తిప్పికొట్టాడు. పవన్ కళ్యాణ్‌పై ఎలాంటీ కేసులు లేనప్పుడు ఆయన బీజేపీ, టీడీపీలతో దోస్తి చేసి ఏంసాధించాడని నాని ప్రశ్నించారు. వైసీపీ తెచ్చిన 486 జీవోపై ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్న పవన్ కళ్యాణ్ అప్పుడేందుకు రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోడీ వద్దకు వెళ్లలేదని అడిగారు. ఇక గత ఎన్నికల్లో జనసేన సీట్లు కూడ చంద్రబాబు నాయుడే ఇచ్చారని ఆరోపించారు.

తండ్రి,కోడుకులు లవ్‌లెటర్లు రాస్తున్నారు

తండ్రి,కోడుకులు లవ్‌లెటర్లు రాస్తున్నారు

ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి లవ్ లెటర్లు రాసినట్టు లేఖల మీద లేఖలు రాస్తున్నారని విమర్శించారు. బంగారు బాతులాంటీ రాజధాని నిర్మాణం చేసానని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇక్కడ కనీసం టీ కూడ దొరకదని హైకోర్టు జడ్డిలు అన్నట్టు పత్రికలో వచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు కట్టిన బంగారు బాతు ఎక్కడుందని ప్రశ్నించారు. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వార చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు లక్ష కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+