పవన్ కళ్యాణ్‌కు షాక్:సీఎం జగనన్న..దేవుడంటూ:సభా సాక్షిగా.. ఆకాశానికెత్తేసిన జనసేన ఎమ్మెల్యే.
Recommended Video
ఏపీ శాసనసభలో జనసేన నుండి ఎన్నకైన ఏకైక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. బడ్జెట్ పైన మాట్లాడుతూ ప్రతీ సందర్భంలోనూ ముఖ్యమంత్రి ప్రశంసలకే జనసేన ఎమ్మెల్యే రాకాప వర ప్రసాద్ ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు..వైద్యం..బలహీన వర్గాలకు చేసిన కేటాయింపుల పైన హర్షం వ్యక్తం చేసారు. ఇక, అంతటితో ఆగ లేదు.. ఏకంగా తాము కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే..కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అంటూ ఆకాశానికెత్తేసారు. జనసేన ఎమ్మెల్యే ప్రసంగం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

బడ్జెట్‌కు జనసేన ప్రశంసలు..
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన శాసనసభలో జనసేన ప్రశంసలు కురిపించింది. సభలో బడ్జెట్ పైన ప్రసం గించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను ప్రస్తావించి..అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు.ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారని..వారి అంచనాల కు తగిన విధంగానేబడ్జెట్ రూపొందించారన్నారు. పూర్తి పారదర్శకతతో బడ్జెట్‌ను తయారు చేశారని...బడ్జెట్‌లో సంక్షే మం.. అభివృద్ధి కార్యక్రమాలున్నాయని రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించటం పైన ప్రభుత్వాన్ని అభినందించారు.

కోరని కోర్కెలు కూడా దేవుడు జగనన్న ..
మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం జగన్ నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రాధాన్యత ఇచ్చారు. 108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగిందని ప్రశంసించారు. ఇదే సమయంలో నాటి ప్రభుత్వ తీరు పైన విమర్శలు చేసారు. గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ కేవలం 50 రోజుల్లో తయారు చేసింది కాదని... పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి జగన్ ఈ బడ్జెట్ రూపొందించారని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా..కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే . కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్ జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారుంటూ రాపాక వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. అయితే, రాపాక గత సమావేశాల సమయంలోనూ జగన్‌కు మద్దతు గానే వ్యవహరించారు.

పవన్ కళ్యాణ్ సమర్ధిస్తారా..ఏం చేయనున్నారు..
తన పార్టీ నుండి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి..పూర్తిగా ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాపాక వర ప్రసాద్ పైన ఇప్పుడు పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల నుండి ఓడినా..ఒక ఎమ్మెల్యే సభలో ప్రాతినిధ్యం ఉంటుందని..పార్టీ వాయిస్ బలంగా విని పిస్తారని ఆశించారు. అయితే, ఇప్పుడు ఏకైక సభ్యుడు కావటంతో ఇప్పుడు ఆయన వాయిస్ సభలో పార్టీ వాయిస్‌గా మారింది.ఇప్పుడు వరప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు...ముఖ్యమంత్రి పైన ప్రశంసల పైన పవన్ ఏ రకంగా సమర్ధిస్తారా లేక ఎమ్మెల్యేకు సూచనలు చేస్తారా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications