విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయరాం హత్య: శిఖాచౌదరిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? హైదరాబాద్‌కు బదలీ ఛాన్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాట్లాడారు. జయరాం హత్య కేసులో విచారణ దాదాపు పూర్తి అయిందని చెప్పారు. కేసు విచారణ కోసం ఆరు టీంలను నియమించినట్లు తెలిపారు. జయరాం హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.

శిఖా చౌదరిని తప్పించే ప్రయత్నంపై

శిఖా చౌదరిని తప్పించే ప్రయత్నంపై

ఈ కేసు నుంచి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా డీజీపీ స్పందించారు. ఈ కేసులో ఎవరినీ తప్పించేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. జయరాంను హైదరాబాదులోనే హత్య చేశారని చెప్పారు. జయరాం హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిఖా చౌదరిని, ఆమె ప్రియుడు రాకేష్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

మావయ్యతో నాకు శారీరక సంబంధం, నచ్చింది ఒప్పుకున్నా.. అది నా ఇష్టం: శిఖాచౌదరిమావయ్యతో నాకు శారీరక సంబంధం, నచ్చింది ఒప్పుకున్నా.. అది నా ఇష్టం: శిఖాచౌదరి

నేడు లేదా రేపు మీడియా ముందుకు

నేడు లేదా రేపు మీడియా ముందుకు

ఈ కేసు విషయమై నందిగామ డీఎస్పీ మాట్లాడుతూ.. కేసులో అసలు నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మీడియా ముందు నిందితులను ప్రవేశపెడతామని చెప్పారు. శిఖా చౌదరి తమ అదుపులో లేదని స్పష్టం చేశారు. మీడియాలో స్టేషన్లో శిఖా చౌదరి ఉన్నట్లు ఫోటోలు వచ్చాయని, అవి తమ దగ్గర తీసినవి కాదని చెప్పారు. ఈ కేసులో తాము ఎవరికీ అనుకూలంగా పని చేయడం లేదని చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. మీడియాకు సమాచారం ఇచ్చారని మేము ఏ పోలీసుపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. డిపార్టుమెంట్ బదలీలు తప్ప, ఎవరి మీద చర్యలు లేవన్నారు. కేసు ముగింపు దశలో ఉన్నందున నిందితుల పేర్లను వెల్లడించలేమని చెప్పారు.

కేసు హైదరాబాద్‌కు బదలీ చేసే ఛాన్స్

కేసు హైదరాబాద్‌కు బదలీ చేసే ఛాన్స్

కేసును హైదరాబాద్‌కు బదలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హత్య హైదరాబాదులోనే జరిగినట్లు తేలడంతో బదలీ చేస్తారని అంటున్నారు. జూబ్లీహిల్స్‍‌లోని జయరాం ఇంటికి మాదాపూర్ పోలీసులు వెళ్లారు. కాగా, జయరాంను తానే హత్య చేసినట్లు విచారణలో రాకేష్ రెడ్డి అంగీకరించినట్లుగా కూడా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జయరాంను కోపంతో కొట్టానని, హార్ట్ పేషెంట్ కావడంతో చనిపోయాడని, మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంచానని, సాయంత్రం కారులో శవాన్ని కారులో ఎక్కించి నందిగామకు తరలించానని, ఆ తర్వాత శవాన్ని అక్కడే వదిలి బస్సులో హైదరాబాద్ చేరుకున్నానని, కానీ జయరాంను చంపాలని కొట్టలేదని, కోపంతో రెండు దెబ్బలు వేయగానే చనిపోయాడని, తన వద్ద రూ.4.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వలేదని, ప్రేమ పేరుతో శిఖా చౌదరి తనతో లక్షల రూపాయలు ఖర్చు చేయించిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇదీ రాకేష్ రెడ్డి

ఇదీ రాకేష్ రెడ్డి

రాకేష్ రెడ్డి జులాయిగా తిరుగుతూ అమ్మాయిలకు వల వేసేవాడనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా ఉంటూ డబ్బు వసూలు చేసేవారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని కూడా పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.నగర శివారులోని ఓ పార్టీ నేతకు ముఖ్య అనుచరుడిగా చెలామణి అయ్యేవాడని అంటున్నారు. జూబ్లీహిల్స్‌లో అత్యంత విలాసమవంతమైన జీవితాన్ని రాకేష్ రెడ్డి గడుపుతున్నాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. రాకేష్ రెడ్డి నెలకు రూ.4 లక్షల ఇంటి అద్దె చెల్లిస్తున్నాడట. జూబ్లీహిల్స్‌లో తన ప్లాట్లోనే అన్ని సెటిల్మెంట్స్ చేసేవాడట.

English summary
Police probing the murder of NRI industrialist Chigurupati Jayaram, are suspecting the involvement of some of his family members in the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X