విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణమ్మకు జల కళ.. భారీగా వరద ఉధృతి.. దిగువకు నీటి విడుదల

|
Google Oneindia TeluguNews

విజయవాడ : కృష్ణమ్మ జల కళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో కళకళలాడుతోంది. ఆ క్రమంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. భారీగా వరద నీరు చేరుతుండటంతో మంగళవారం ఉదయం నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. అనంతరం ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. అదలావుంటే నదీ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. వరద ఉధ‌ృతితో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఖైరతాబాద్ పెద్ద గణేశుడిదే తొలి నిమజ్జనం.. మద్యం దుకాణాలు బంద్ ఎప్పుడంటే..!ఖైరతాబాద్ పెద్ద గణేశుడిదే తొలి నిమజ్జనం.. మద్యం దుకాణాలు బంద్ ఎప్పుడంటే..!

కృష్ణమ్మ పరవళ్లు.. ఎగువన వర్షాలతో జల కళ

కృష్ణమ్మ పరవళ్లు.. ఎగువన వర్షాలతో జల కళ

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జల కళ సంతరించుకుంది. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీల దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. సోమవారం (09.09.2019) నాడు సాయంత్రం నుంచి మొదలైన వరద ప్రవాహం మంగళవారం ఉదయం నాటికి మరింత పెరిగింది. దాంతో ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. అలా 3 లక్షల 39వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ కళకళలాడుతోంది.

నాగార్జున సాగర్‌లోకి వరద ఉధృతి

నాగార్జున సాగర్‌లోకి వరద ఉధృతి

సోమవారం సాయంత్రం నాగార్జున సాగర్‌లోకి వరద ఉధృతి పెరగడంతో 16 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు. అలా 2 లక్షల 94 వేల 300 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టులోకి విడుదల చేశారు. అయితే పులిచింతల ప్రాజెక్టులో కూడా గరిష్ఠ నీటి మట్టం బాగా పెరిగింది. అది కాస్తా 45.77 టీఎంసీలకు చేరువ కావడంతో అధికారులు అలర్టయ్యారు. ఆ క్రమంలో దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి 50 వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు.

ప్రకాశం బ్యారేజీలోనూ పెరిగిన నీటి మట్టం

ప్రకాశం బ్యారేజీలోనూ పెరిగిన నీటి మట్టం


అటు ప్రకాశం బ్యారేజీలోనూ నీటి మట్టం పెరిగిపోయింది. గరిష్ఠ నీటి మట్టం రికార్డు స్థాయికి చేరడంతో దాదాపు 18 వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ క్రమంలో 45 గేట్లను ఎత్తి నీటిని రిలీజ్ చేయడంలో అధికారులు తలమునకలయ్యారు. అదలావుంటే కృష్ణా రివర్‌కు భారీగా వరద ఉధృతి పెరగడంతో నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అయితే గత వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళన చెందుతున్నారు. వరద నీటి కారణంగా ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

వరద నీటితో జలశయాలు కళకళ

వరద నీటితో జలశయాలు కళకళ

వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలశయాలు కళకళలాడుతున్నాయి. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 10 వేల 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదలావుంటే అధికంగా నీటి లభ్యత ఉన్న కారణంగా ఇప్పటికే తాగునీటి చెరువులను నింపేశారు అధికారులు. అంతేకాదు సాగునీటి అవసరాలు మినహాయించి ఎక్సెస్‌గా ఉన్న నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఆ క్రమంలో 1500 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ వాగులోకి విడుదల చేస్తున్నారు. ఈసారి ప్రాజెక్టులు జల కళ సంతరించుకోవడంతో సాగర్ పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

English summary
Krishna River got Full of water. At the top, it is flooded with rain. The authorities are releasing water from Srisailam to Nagarjuna Sagar. Nagarjuna Sagar radial crust gates were lifted on Tuesday morning as heavy flood waters were approaching. The water was then released to Prakasam Barrage. That's why people in riverine areas have been alerted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X