వ్యాపారి నిర్లక్ష్యం: నీళ్లకు బదులు యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో, తాగిన విద్యార్థి పరిస్థితి విషమం
అమరావతి: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎనికెపాడులో వ్యాపారి నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. లయోలా కాలేజీలో డిగ్రీ చదువుతున్న చైతన్యకు బాగా దాహం వేసింది. దీంతో సమీపంలోని షాప్‌కు వెళ్లి వాటర్ బాటిల్ అడిగాడు.
అయితే, ఆ వ్యాపారి నిర్లక్ష్యంతో వాటర్ బాటిల్ కు బదులు యాసిడ్ బాటిల్ అతనికిచ్చాడు. ఇది గమనించని చైతన్య బాగా దాహం వేయడంతో యాసిడ్ తాగేశాడు. యాసిడ్ మంటతో అతడు విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆ విద్యార్థినిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

కాగా, చైతన్య వైద్యానికి కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు విరాళాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది. యాసిడ్ తాగడం వల్ల శరీరం లోపల భాగాలపై తీవ్ర ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
తండ్రిని హత్య చేసిన కొడుకు అరెస్ట్
మద్యానికి బానిసై, కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగ్రహానికి గురైన కుమారుడు.. తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రజకపేటలో శుక్రవారం నల్లపాటి శశధర్.. తన తండ్రి కోటేశ్వరరావు(60)ను సుత్తితో కొట్టి చంపేశాడు. సమాచారం అందడంతో గాలింపు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడు శశిధర్ ను అరెస్ట్ చేశారు. కోటేశ్వరరావు ప్రతిరోజు మద్యం తాగి వచ్చి కుటుంబసభ్యులను వేధిస్తున్న క్రమంలోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులను వేధించడం, డబ్బులను దొంగిలించడం లాంటి చర్యలను తట్టుకోలేకే నిందితుడు తండ్రిని హత్య చేశాడు.












Click it and Unblock the Notifications