మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష
అమరావతి: విజయవాడ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం. 2017లో ఇబ్రహీంపట్నంలో మైనర్ బాలికపై సైకం కృష్ణారావు అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుడు కృష్ణారావుపై నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం కింద నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షి విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పును వెలువరించారు. పోలీసులు కొంత మంది సాక్షులను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు.

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన నిందితుడు కృష్ణారావు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి కఠిన శిక్ష పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
2017 డిసెంబర్ నెలలో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు తల్లితోపాటు ఉయ్యూరు నుంచి తల్లితో కలిసి బాధిత బాలిక ఇబ్రహీంపట్నంకు వచ్చింది. బాలిక బందువైన కృష్ణారావు ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కృష్ణారావును అరెస్ట్ చేసి దర్యాప్తు చేశారు.
అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు కృష్ణారావుకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications