జగన్ , కేసీఆర్ ల అవసరం మోడీకి లేదు .. తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఏంటో ?
Recommended Video
దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యనుంది. ఈ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లనే సంపాదించుకుంది.అయితే ఫలితాలకు ముందు కేంద్రంలో హంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయని ప్రచారం జరిగింది. బీజేపీపైన వ్యతిరేఖత ఉందని చాలా మంది భావించారు . అయితే ఆ లెక్కలన్నీ తప్పని తెలుస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం సంపాదించుకుంది.

హంగ్ వస్తే ఎవరికి వారు కీలకం అవుతామని భావించిన తెలుగురాష్ట్రాల సీఎంలు
రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వస్తే ఎవరికి వారు మేమే కీలకం అవుతామని భావించారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశంలో చక్రం తిప్పుతుందని కలలు కన్నారు. ఆ కలలన్నీ కల్లలు అయ్యాయి. దేశంలో బీజేపీకి అనుకున్న స్థానాలు రాకపోతే ప్రాంతీయ పార్టీల అవసరం ఎంతైనా ఉండేది కానీ ఇప్పుడు ఆవసరం లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికలలో 17 స్థానాలకు గాను 16 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పుకొచ్చారు కేసీఆర్. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి కూడా తిరిగారు. అయితే చివరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్‌కి గట్టి దెబ్బే తగిలింది. మొత్తం 17 స్థానాలకు గాను కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే అనూహ్యంగా ఈ సారి ఇక్కడ బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.

దక్షిణాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన బీజేపీ
ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది . ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే కేంద్రం లో బీజేపీకి మెజార్టీ రాకుంటే వైసీపీ సహకారం అవసరం వుండేదేమో కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ బీజేపీ సహకారం కోరితే ప్రత్యేక హోదాపై పట్టు బిగించాలని భావించారు జగన్ మోహన్ రెడ్డి . కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. . ఇక కర్ణాటకలో ఈ సారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 25 స్థానాలను గెలుచుకుంది.

తెలుగు రాష్ట్రాలకు మోడీ సహకరిస్తారా ? భవిష్యత్ ఏంటో
మరో సారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమైపోయింది. అయితే ప్రాంతీయ పార్టీల మద్ధతు కూడా ఇప్పుడు మోదీకి అవసరం లేదు. అయితే 9 సీట్లున్న టీఆర్ఎస్‌కి, 22 సీట్లున్న వైసీపీకి మోదీ కేబినెట్‌లో ఇక ఎలాంటి మంత్రి పదవులు దక్కవనే అర్ధమవుతుంది. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్‌కి మోదీ నుంచి సానుకూల స్పందన వస్తుందనేది కూడా కష్ట తరమే ఇక తెలంగాణా రాష్ట్రానికి మోడీ సకహకరించటం కూడా ఒకింత కష్టమే . ఏది ఏమైనా మోడీ సర్కార్ ఎవరి సహకారం లేకుండా అధికారంలోకి రావటం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీర్ణించుకోలేని అంశం . దీంతో ఇక ముందు తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఏ విధంగా ఉండనుందో మరి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications