విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాకిస్తున్న సొంతపార్టీ నేతలు .. జగన్ ప్రకటనను స్వాగతించిన కేఈ కృష్ణమూర్తి

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని చేసిన ప్రకటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని ఆయన తేల్చి చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు బాసటగా నిలవాల్సిన టిడిపి నేతలు మాత్రం చంద్రబాబుకు వరుస షాక్ లు ఇస్తున్నారు.

ఏపీలో మూడు రాజధానుల రచ్చ ... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ కొత్త చర్చఏపీలో మూడు రాజధానుల రచ్చ ... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై టీడీపీ కొత్త చర్చ

చంద్రబాబుకు వరుస షాకులు ఇస్తున్న నేతలు

చంద్రబాబుకు వరుస షాకులు ఇస్తున్న నేతలు

నిన్నటికి నిన్న మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జగన్ చేసిన ప్రకటనను స్వాగతించి వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దానికి కావలసిన సకల సౌకర్యాలు వైజాగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక అదే కోవలో మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతించారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక నేత , మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా కర్నూలులో హైకోర్టు పెట్టాలని జగన్ చేసిన ప్రకటనను స్వాగతించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రకటనను స్వాగతించిన మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రకటనను స్వాగతించిన మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి

చాలా కాలంగా కర్నూలులో హైకోర్టు కావాలని ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై స్థానిక నేత అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సొంత పార్టీ నేతలు తన వ్యాఖ్యలను సమర్ధించి, తన నిర్ణయానికి కట్టుబడి మాట్లాడుతారు అనుకుంటే అలా కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతున్న తీరు టిడిపిలో ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.

స్థానికంగా విముఖత వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతున్న టీడీపీ నేతలు

స్థానికంగా విముఖత వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతున్న టీడీపీ నేతలు


ఆయా ప్రాంతాలలోని టిడిపి నేతలు అధినేత మాట విని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, స్థానికంగా వారిపై విముఖత వ్యక్తం అవుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తమ రాజకీయ మనుగడ కోసం టిడిపి నేతలు స్థానిక ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపినట్లుగా కనిపిస్తోంది. అధినేత మాటను బేఖాతరు చేసినట్లుగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు సొంత పార్టీ నేతల నుండి వరుస షాకులు తగులుతున్నాయి.

అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు .. చంద్రబాబుకు తలనొప్పిగా టీడీపీ నేతల తీరు

అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు .. చంద్రబాబుకు తలనొప్పిగా టీడీపీ నేతల తీరు

రాజధానిపై జగన్ చేసిన ప్రకటన తుగ్లక్‌ని తలపిస్తోదంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబు, ఏపీ రాజధాని ఒక అమరావతి మాత్రమే ఉండాలి అని తేల్చి చెబుతున్నారు. ఒక్క గుంటూరు , కృష్ణ జిల్లాలలోని టిడిపి నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉండగా, మిగతా జిల్లాలలోని టిడిపి నేతలు దాదాపు సైలెంట్ గా ఉంటున్నారు. కొందరు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్నిస్వాగతిస్తున్నారు.

English summary
Former deputy chief minister KE Krishnamurthy has welcomed the proposal of CM Jagan Mohan Reddy for setting up the Kurnoolu High Court. Former CM and TDP chief Chandrababu Naidu facing problem with the comments of own party leaders. This will create a troubling atmosphere in the TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X