విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్-చంద్రబాబు విడిపోయిందెప్పుడు ? బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ప్రశ్న- జగన్ కు ప్రైవేట్ సైన్యమే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని వరుసగా ప్రకటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కూటమిని మళ్లీ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే క్రమంలో శాప్ ఛైర్మన్, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ -చంద్రబాబు తాజా కలయికపై శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా మచిలీపట్నం వచ్చిన ఆయన.. పవన్-చంద్రబాబు పొత్తు వార్తలపై మాట్లాడారు. అసలు వారిద్దరూ విడిపోయి ఉంటే ఇప్పుడు కలుసుకున్నారు అని చెప్పొచ్చు అసలు వారు ఎప్పుడు కలిసే వున్నారుగా అని వ్యాఖ్యానించారు.
వారిద్దరూ విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా వైసీపీకి 175 సీట్లకు 175 రావడం ఖాయమన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళితే తెలుసుతుంది ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో మా వద్ద లెక్కలు ఉన్నాయి , ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే రండి అని పిలుపునిచ్చారు.

saap chairman byreddy siddharth reddy ask when pawan kalyan-chandrababu divided ?

అంతకుమందు నిన్న రాజమండ్రిలో జరిగిన భేటీలోనూ సిద్ధార్ధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా
ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదనీ... పార్టీ యువత అంతా సీఎం జగన్ కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు. రాజమండ్రిలో వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్
ప్రారంభోత్సవానికి హాజరైన బైరెడ్డి... జగన్ కు వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని మీడియాలను వాడుకున్నా ప్రైవేట్ సైన్యమే ఆయన్ను కాపాడుకుంటుందన్నారు.
సీఎం జగన్ మావాడు అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారనీ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు.

English summary
saap chairman byreddy siddharth reddy on today made interesting coments on pawan kalyan and chandrababu meeting yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X