• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ష‌ర్మిల కేసు : 15 మంది గుర్తింపు : అంద‌రూ వారేనా ..సూత్రధారుల‌ స‌మాచారం సేక‌ర‌ణ‌..!

|

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ష‌ర్మిల ఫిర్యాదు వ్య‌వ‌హారం లో కొత్త ట్విస్ట్‌. త‌న పై అభ్యంత‌ర‌క‌ర పోస్టింగ్‌లు.. ప్ర‌చారం చేస్తున్నారంటూ ష‌ర్మిల హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేసారు. దీని పై ప్ర‌త్యేక విచ‌రాణ బృందం ఏర్పాటు అయింది. విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 15 మందిని పోలీసులు బాధ్యులుగా గుర్తించారు...సూత్ర‌ధారులు ఎవ‌రో గుర్తించే ప్ర‌క్రియ మొద‌లైంది..

పోస్ట్‌ల వెనుక ఎవరున్నారో తేలాలి: పద్మ, ఎన్నికల టైంలో షర్మిల-ప్రభాస్ అంశాన్ని తెరపైకి తెచ్చారంటే

విచాణ ప్రారంభం..

విచాణ ప్రారంభం..

వైసిపి అధినేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పై సోష‌ల్ మీడియా లో అస‌త్య ప్ర‌చారం పై న‌మోదైన కేసులు చ‌ర్య‌లు మొద‌ల య్యాయి. సినీ హీరో ప్ర‌భాస్ తో ష‌ర్మిల‌కు సంబంధాలు ఉన్నాయంటూ చేసిన పోస్టింగ్‌ల పై ఫిర్యాదు చేసారు. ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని చెబుతూ ఈ ర‌కంగా ప్ర‌చారం చేయ‌టం పై ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ష‌ర్మిల ఫిర్యాదు పై టిడిపి నేత‌లు ఒక వైపు వివ‌ర‌ణ ఇస్తూనే..మ‌రో వైపు తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టాన్ని త‌ప్పు బ‌ట్టారు. ఇక‌, ష‌ర్మిల కు మ‌ద్ద‌తుగా సిపిఐ తో పాటుగా కాంగ్రెస్ మ‌హిళా నేత విజ‌య శాంతి సైతం అండ‌గా నిలిచారు. ష‌ర్మిల ఫిర్యాదు పై హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ త‌క్ష‌ణం స్పందించారు. వెంట‌నే ప్ర‌త్యేకంగా విచార‌ణ కోసం టీం ను ఏర్పాటు చేసారు. పోలీసు అధికారుల బృందం విచార‌ణ‌లో భాగంగా బాధ్యుల్న‌రి ప‌ట్టుకోవ‌టానికి చ‌ర్య‌లు మొదలు పెట్టారు.

15 మంది గుర్తింపు... 5 గురు నిందితులు

15 మంది గుర్తింపు... 5 గురు నిందితులు

ష‌ర్మిల పై సోష‌ట్ మీడియాలో చేసిన పోస్టింగ్ ల పై విచార‌ణ ప్రారంభించిన పోలీసులు యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించి.. అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఇప్ప‌టికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణి స్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరా బాద్‌లో స్థిరపడిన వారే. ఈ ఐదుగురూ సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ, యూ-ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసే వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. వారు యూ-ట్యూబ్‌ను వినియోగించే సమయం లో ఏ ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్‌ చేశారో గుర్తించాల్సి ఉంటుంది.

యూ ట్యూబ్ కు లేఖ‌..ఐపి ల ఆధారంగా గుర్తింపు..

యూ ట్యూబ్ కు లేఖ‌..ఐపి ల ఆధారంగా గుర్తింపు..

ఇప్ప‌టికే సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం కోర‌తూ పోలీసులు యూట్యూబ్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆయా చానల్స్ లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్‌ చేశారు. వీడియో పోస్ట్‌ చేసిన వారితో పాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగానూ ఈ వ్య‌వ‌హా రం క‌ల‌క‌లం రేపుతోంది. ష‌ర్మిల త‌న ఫిర్యాదు అనంత‌రం టిడిపి పై విమ‌ర్శ‌లు చేసింది. టిడిపి నేత‌లు సైతం దీనికి కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ పార్టీ ఇటువంటిని ప్రోత్స‌హించ‌ద‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న వారి

వివ‌రాలు కోసం రాజ‌కీయంగా నూ ఆస‌క్తి నెల‌కొంది. పోస్లింగ్ లు పెట్టిన వారు ఏ పార్టీకి మ‌ద్ద‌తు దారులనే అంశం పై ఆరా తీస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రానుంది. ఇది సైతం ఏపి లో ఎన్నిక‌ల ముందు క‌ల‌క‌లం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
In Sharmila complaint Hyderabad police traced 15 persons and taken them to custody. Police investigating case with cyber crime experts. Written letter You tube for IP codes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X