విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొనకొండకు సీఎం జగన్ కు లింకు ఏంటి : రాజధానిగా ఆ పేరు ప్రచారం వెనుక..ఇదీ అసలు రాజకీయం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. అమరావతి రాజధానిగా ఇక కొనసాగదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో దొనకొండ ఇక ఏపీ రాజధాని కాబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. జగన్ తొలి నుండి దొనకొండ మీదే ఆసక్తితో ఉన్నారని.. అక్కడ వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేసారి ప్రచారం సారంశం. అయితే, రాజధానిని అమరావతి నుండి తప్పించటం సాధ్యమేనా అనేది మరో చర్చ. ఇదే సమయంలో అసలు దొనకొండ ప్రాంతానికి..ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న లింకు ఏంటి. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయం నుండి ఇదే తరహా ప్రచారం ఎందుకు సాగుతోంది అనే విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇక, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావటంతో మరో సారి అదే తరహా ప్రచారం తెర మీదకు వచ్చింది. దొనకొండ రాజకీయం వెనుక అసలు కధ ఏంటంటే...

Recommended Video

బొత్సా వ్యాఖ్యలతో మండిపడుతున్న టీడీపీ| YSRCP Govt To Change AP Capital From Amaravati To Donakonda ?
దొనకొండ రాజకీయం వెనుక..

దొనకొండ రాజకీయం వెనుక..

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపి కి రాజ‌ధాని ఖ‌రారు అంశంలో టిడిపి ప్ర‌భుత్వం అనేక రాజ‌కీయ విమ‌ర్శ‌లు తెర లేపింది. తా ము అమ‌రావ‌తి ఎంపిక చేస్తే..ప్ర‌తిప‌క్ష వైసిపి కి అమ‌రావ‌తి ఇష్టం లేద‌ని..వారు దొన‌కొండ రాజ‌ధాని చేయాల‌ని కోర‌కున్నార‌ని ప్ర‌చారం చేసింది. సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారి ఇదే అంశం పై రాజకీయం గా విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. వైసిపి తో పాటుగా..మాజీ సీయ‌స్ ఐవైఆర్ సైతం దొన‌కొండ‌నే రాజ‌ధాని చేయాల‌ని కేం ద్ర ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసారని అప్పట్లో టిడిపి నేతలు ఆరోప‌ణ‌లు చేసారు. అయితే, అస‌లు దీని వెనుక ముఖ్య‌మంత్రిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనే పెద్ద ప్రాసెస్ న‌డిచింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపికి రాజ‌ధాని ఎక్క‌డ అనే అంశం పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. రాజ‌ధాని ఎక్క‌డో కూడా ఖ‌రారు చేయ‌కుండా రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యం జ‌రిగిపోయింది. అదే స‌మ‌యంలో..ఏపిలో అధికారంలో ఉన్న కిర‌ణ్ కుమా ర్ రెడ్డి ప్ర‌భుత్వం నుండి కేంద్ర హోం శాఖ ఏపిలో రాజ‌ధాని ఏర్పాటు లో బాగంగా అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ భూములు..ప్రైవేటు భూములు.. సాగు లో ఉన్న భూములు వివ‌రాల‌తో పాటు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న వ‌న‌రులు..ఉపాధి అవ‌కాశాలు..

<strong>సీఎం జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర కోసం.. రమేష్ బీజేపీలో పచ్చ కోవర్ట్ :బీజేపీ పై అంబటి ఫైర్..!! </strong>సీఎం జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర కోసం.. రమేష్ బీజేపీలో పచ్చ కోవర్ట్ :బీజేపీ పై అంబటి ఫైర్..!!

ప్ర‌భుత్వ రంగ‌-ప్రైవేటు రంగ సంస్థ‌ల- కార్యాల‌యాల ఏర్పాటు కు కావాల్సిన భూములు ఎక్క‌డ అందుబాటులో ఉన్నాయో పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. దీని పై నాటి రెవిన్యూ మంత్రి ర‌ఘువీరా రెడ్డి అప్పుటి సిసిఎల్ఏ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కు దీని పై స‌వివ‌రంగా భూముల లెక్క‌ల‌తో స‌హా నివేదిక ఇవ్వాల‌ని సూచించారు. దీంతో, ప్ర‌భుత్వం ఆదేశాల మేరకు ఐవైఆర్ ప‌ద‌మూడు జిల్లాల్లోని క‌లెక్ట‌ర్ల నుండి సేకరించిన స‌మాచారం ప్ర‌కారం ఆ నివేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. ఇక‌, ఇదే స‌మ‌యం లో ఏపి రాజ‌ధాని ఖ‌రారు కోసం ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో నివేదిక కోరుతూ కేంద్ర శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీని ఏర్పాటు చేసింది.

 నాడు కేంద్రానికి సూచించిన అధికారులు..

నాడు కేంద్రానికి సూచించిన అధికారులు..

రాష్ట్ర విభజన సమయంలో గవర్నర్ పాలనలోనే విభజన వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి. అదే సమయంలో కేంద్ర ప్ర‌భుత్వం అడిగిన స‌మాచారం మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా ఏపిలోని నాలుగు ప్రాంతాల‌ను కేంద్రానికి ప్ర‌తిపాదించారు. అట‌వీ భూములున్న నూజివీడు, అచ్యుతాపురం తో పాటుగా దొన‌కొండ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఆ నివేదిక లో స్ప‌ష్టం చేసారు. సిసిఎల్ఏ గా ఐవైఆర్ ఇచ్చిన నివేదిక‌ను జ‌త చేస్తూ నాటి రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి ఒక నివేదిక‌ను పంపింది. అందులో ఎక్క‌డా రైతుల భూములకు ఇబ్బంది లేకుండా.. వెనుక బ‌డిన ప్రాంతం అభివృద్ది చెందాలంటే దొన‌కొండ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్దికి అవ‌కాశాలు ఉన్నా య‌ని..అక్క‌డ ప్ర‌భుత్వ భూములు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని..ఆ ప్రాంత్తో 5 వేల హెక్టార్ల‌కు పైగా నిరుప‌యోగ ప్ర‌భుత్వ భూములు ఉన్నాయ‌ని..ఇదే ప్రాంతంలో అట‌వీ భూములు ఉన్నాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి నివేదించింది. దీని తో పాటుగా సిసిఎల్ఏ గా ఐవైఆర్ ఇచ్చిన రిపోర్ట్ ను జ‌త చేసి కేంద్రానిని నివేదించారు. ఆ తరువాత ఏపి రాజ‌ధాని ఖ‌రారు కోసం కేంద్రం నిపుణుల‌తో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏయ‌స్ అధికారి శివరామ కృష్ణ‌న్ నేతృత్వంలో నలుగురు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఏపి లో ప‌ర్య‌టించిన రాజ‌ధాని ఎక్క‌డ ఏర్పాటు చేయాలో సూచించాల‌ని పేర్కొంది. అయితే, ఆ క‌మిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి దొన‌కొండ ప్రాంతంలో ఉన్న భూమి వ‌న‌రుల గురించి ప్ర‌స్తావించింది. మార్టూరు- వినుకొండ‌- దొన‌కొండ ప్రాంతాన్ని అన్ని ర‌కాలుగా రాజ‌ధానికి అర్హ‌త ఉ న్న ప్రాంతంగా..దీనికి అభివృద్ది చెందే ప్రాంతంగా కేంద్రానికి సిఫార్సు చేసింది. పంట‌ల భూముల జోలికి వెళ్ల‌కుండా ప్ర‌భుత్వ భూముల‌ను-అట‌వీ భూముల‌ను వినియోంచుకోవాల‌ని సూచించారు.

దొనకొండ ప్రస్తావన ఏనాడు చేయని జగన్..

దొనకొండ ప్రస్తావన ఏనాడు చేయని జగన్..

రాష్ట్ర విభజన..ఎన్నికల తరువాత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. తుళ్లూరు మండలంలో..వాస్తు ప్రత్యేక అవసరాల కారణంగా అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలనే ఉద్దేశంతో ..ఆ ప్రాంతంలో జగన్ ను దెబ్బ తీసేందుకు చంద్ర‌బాబు..వ్యూహాత్మ‌కంగా వైసిపి అమ‌రావ‌తిలో రాజ‌ధానికి వ్య‌తిరేక‌మ‌నే ప్ర‌చారం తెర పైకి తెచ్చారు. తన ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఐవైఆర్ నాడు ఇచ్చిన నివేదిక ఆధారంగా...జగన్ కు మేలు చేసేందుకు అనుకూల నివేదిక ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసిపి రైతుల భూముల‌ను అంత పెద్ద మొత్తంగా సేక‌రించ టానికి మాత్ర‌మే అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది కానీ, అమ‌రావ‌తిలో రాజ‌ధానిని వ్య‌తిరేకించ‌లేదనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా..దొన కొండ ప్రాంతంలో రాజ‌ధాని ఏర్పాటు చేయ‌మ‌ని ఏనాడు డిమాండ్ చేయలేదని సష్టం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు వైసీపీ హయాంలో దొనకొండ పారిశ్రామికంగా డెవలప్ చేయటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు మరోసారి దొనకొండ పేరు ప్రచారంలోకి తీసుకురావటం రాజకీయ ఎత్తుగడలో భాగమనేది వైసీపీ నేతల వాదన

English summary
AP capital change speculations started in AP ofter minister Botsa comments on Amaravathi. Some leaders saying that jagan want to shift capital to Donakonda. Facts behind Donakonda is now became for political ldiscussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X