చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!
ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి. జాతీయ స్థాయిలోనూ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. మరి..ఏపి లో మాత్రం ఎందు కు కలవటం లేదు. తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ అని చెబుతున్నప్పటికీ..చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. తాము వద్దనుకుంటున్న పొత్తును..కాంగ్రెస్ నేతలతోనే చెప్పించి..సేఫ్ గేమ్ అడారు. అదే సమయంలో.. ప్రభుత్వ వ్యతి రేక ఓట్ల చీలకే లక్ష్యంగా మరో అడుగు ముందుకేసారు..మరి..ఈ వ్యూహం వైసిపి పై ఎలాంటి ప్రభావం చూపుతుంది..!

చంద్రబాబు మాటకే ప్రాధాన్యత..
కాంగ్రెస్ అధినేత ఇంటికి వెళ్లి మరీ పొత్తు మైత్రి కుదుర్చుకున్న టిడిపి అధినేత చంద్రబాబు మాటకే తొలి నుండి రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం లో భాగంగా..హైదరాబాద్ లో ఓ హోటల్ లో సమావేశమైప సమయంలోనే వీరిద్దరి మధ్య ఏపిలో పొత్తుల పై చర్చ జరిగింది. ఏపిలో కాంగ్రెస్ - టిడిపి కలిసి వెళ్లాలో .. విడివిడిగా పోటీ చేయాలో నిర్ణయించే అధికారాన్ని రాహుల్ గాంధీ..చంద్రబాబుకే అప్పగించారు. ఇక, తెలంగాణ ఎన్నికల ఫలితాల ఈ ఇద్దరి పొత్తు పై ప్రభావం చూపించాయి. ఏపిలో టిడిపి నేతలు కాంగ్రెస్ తో పొత్తు వద్దని పార్టీ అధినేత ను కోరారు. చంద్రబాబు సైతం పొత్తు పై సర్వేలు చేయించారు. సానుకూలత లేకపోవటంతో పొత్త కంటే..విడివిడిగా పోటీ చేసి కలిసి ఉండటం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. అంతే , ఇదే విషయాన్ని ఢిల్లీ పర్య టనలో భాగంగా..రాహుల్ కు వివరించారు. వెంటనే రాహుల్ సైతం ఓకే చెప్పేసారని సమాచారం.
చంద్రబాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్!

విడివిడిగా పోటీ..కీలక స్థానాలే లక్ష్యం..!
టిడిపి - కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసినా..జాతీయ స్థాయిలో ఉన్న సఖ్యత కారణంగా..ఇక్కడ కూడా సహకరించుకొనే పరిస్థితి ఉంటుందని విశ్లేషకుల అంచనా. అందులో భాగంగా..కాంగ్రెస్ కొన్ని ఎంపిక చేసిన స్థానాల్లో గెలవటానికి లేదా గణనీయంగా ఓట్లు చీల్చే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వైసిపి బలంగా ఉన్న స్థానాలనే లక్ష్యంగా చేసుకొని ఈ ఎత్తుగడ అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, 2014 కంటే ప్రస్తుతం కాంగ్రెస్ పై కొంత ప్రజల్లో మార్పు వచ్చిందని..అది కాంగ్రెకు ఓట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులు పూర్తి గా వైసిపి వైపు టర్న్ అయ్యారు. తిరిగి ఆ ఓటింగ్ లో కొంత శాతం తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని భావిస్తు న్నారు. దీంతో..అభ్యర్ధుల ఎంపిక.. ప్రచారం.. పోల్ మేనేజ్‌మెంట్ పై పూర్తి అవగాహన తో ముందెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాష్ట్ర స్థాయి నేతలతో కాకుండా నేరుగా పార్టీ అధినేతతో సంప్రదింపుల ద్వారా టిడిపి అధినేత చంద్రబాబు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీంతో..ఏపి కాంగ్రెస్ నేతలు ఆదేశాలు అమలు చేయటాని కే పరిమితం అవుతున్నారు.

ఓట్ల చీలక..వైసిపికి నష్టం చేసేనా..
ఏపిలో టిడిపి లక్ష్యం ఇప్పుడు వైసిపి. వచ్చే ఎన్నికల్లో వైసిపి ని దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని అస్త్ర శస్త్రాలను వినియోగిస్తున్నారు. అటు సంక్షేమ పధకాలు..ఇటు రాజకీయంగా ఉన్న అన్ని అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా..ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసిపికి వెళ్లకుండా చూడటమే లక్ష్య మని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ తో పొత్తు వద్దని నిర్ణయించారు. రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీలు ఉంటాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్‌తో కాంగ్రెస్ పొత్తు లేదని...అయినా కాంగ్రెస్ నేతలు కోల్‌కతా ర్యాలీకి వచ్చారని చంద్రబాబు చెప్పటం ద్వారా ఏపిలోనూ తమ సూచన మేరకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పకనే చెప్పారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు..వైసిపి ఓటింగ్ చీల్చగలు గుందనే దాని పై అంచనాలు మొదలయ్యాయి. దీంతో, ఇప్పుడు వైసిపి నేతలు కాంగ్రెస్ - టిడిపి మధ్య ఒప్పందాలను లక్ష్యంగా చేసుకొంటున్నారు. కాంగ్రెస్ కు ఓట్లు పడే అవకాశం లేదని..వైసిపి కి ఎటువంటి నష్టం ఉండదని పార్టీ నేత లు చెబుతున్నారు. మరి..టిడిపి వ్యూహాలు ఎంత వరకు వైసిపి పై ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి.