దేశంలోనే 10భాషల్లో తొలి ఏఐ కాప్‌రైటర్..హైదరాబాద్ పోలీసుల ఘనత!

హైదరాబాద్ పోలీసుశాఖ మరోసారి దేశానికి ఆదర్శం అయింది. ఫిర్యాదు నమోదు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించే దిశగా దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీలో ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

ఏఐ కాప్ రైటర్.. 10 భాషల్లో ఫిర్యాదుకు ఛాన్స్

ఈ యాప్ ద్వారా 10కి పైగా భారతీయ భాషల్లో తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ తదితర భాషలలో ఫిర్యాదులు చేయవచ్చు. బాధితులు మాట్లాడిన విషయాలను ఏఐ సాంకేతికత వెంటనే టెక్స్ట్ రూపంలోకి మార్చి, ఒక భాష నుంచి మరొక భాషకు అనువదించి, స్వయంచాలకంగా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేస్తుంది. ఇది ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

India first AI Copriter app launched by Hyderabad Police allows complaints in 10 languages

భాష వలన కలిగే ఇబ్బందుల నుండి విముక్తి

ఈ ఏఐ కాప్ రైటర్ తో భాషా సమస్యల వల్ల ఏర్పడే ఇబ్బందులను తొలగించవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదులో జాప్యం, తప్పులు తగ్గించవచ్చు.పోలీసు అధికారులపై టైపింగ్ భారం తగ్గించవచ్చు.

India first AI Copriter app launched by Hyderabad Police allows complaints in 10 languages

మొదటిదశలో హైదరాబాద్‌లోని 80పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ అమలు

ఈ ఏఐ కాప్ రైటర్ గురించి సీపీ సజ్జనార్ మాట్లాడుతూ,"భాష అడ్డు కాకుండా ప్రతి బాధితుడికి న్యాయం అందాలి. ఈ యాప్ ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షణాల్లో పూర్తి చేయవచ్చు. రికార్డులను తారుమారు చేసే అవకాశం కూడా ఉండదు" అని తెలిపారు. మొదటి దశలో హైదరాబాద్‌లోని 80 పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అమలు చేయనున్నారు. బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు.

లక్షకే తులం బంగారం..కట్ చేస్తే జరిగిందిదే!
లక్షకే తులం బంగారం..కట్ చేస్తే జరిగిందిదే!

బాధితులకు భాషతో సంబంధం లేకుండా త్వరిత న్యాయం

ఈ కొత్త సాంకేతికతతో హైదరాబాద్ పోలీసుశాఖ మరింత స్నేహపూర్వకంగా, సమర్థవంతంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భాషా అవరోధాలు లేకుండా త్వరితన్యాయం అందించడంలో ఈ ఏఐ యాప్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశంలోని అనేక నగరాలు టెక్నాలజీని పోలీసింగ్‌లో ఉపయోగించడం ప్రారంభించాయి. అయితే ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ను అమలు చేసిన మొదటి నగరంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+