కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్!

లడఖ్ లోని లేహ్ సమీపంలో భారత సైన్యానికి చెంది చీతా హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. తంగ్స్తే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం నుంచి ఓ మేజర్ జనరల్‌తో పాటు ఇద్దరు పైలట్లు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. అందులోని ముగ్గురు అధికారులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటం నిజంగా ఓ అద్భుతమని రక్షణ శాఖ అధికారులు అభివర్ణించారు.

ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ స్థాయి అధికారులు నడుపుతుండగా.. అందులో ప్రయాణికుడిగా ఆర్మీకి చెందిన 3వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సచిన్ మెహతా ఉన్నారు. చైనా సరిహద్దులకు ఆనుకుని ఉన్న తూర్పు లడఖ్‌లోని శ్యోక్ నది ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి సైన్యం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.

Army Cheetah Helicopter Crashes Near Leh Major General and Pilots Escape Unhurt Full Details

అయితే ఈ ప్రమాదం జరిగిన విషయం అధికారికంగా కంటే ముందు సోషల్ మీడియా ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆర్మీ అధికారులు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కూలిపోయిన హెలికాప్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. పర్వత వాలుపై నిలబడి ప్రాణాలతో బయటపడిన ఆనందంలో ఓ పైలట్ విక్టరీ సింబల్ చూపిస్తూ ఈ సెల్ఫీ దిగారు. ఈ అరుదైన సెల్ఫీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇదిలావుండగా.. సైన్యంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పాత 'చీతా', 'చేతక్' హెలికాప్టర్లను దశలవారీగా తొలగించే ప్రక్రియను మరో ఏడాది లేదా రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే 8 నుంచి 10 సంవత్సరాలలో వీటి స్థానంలో సరికొత్త 'లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను' భారత సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+