పట్టాభిని ఏం చేయదలచుకున్నారు: పులివెందుల రాజకీయాలిక్కడ చెల్లవ్: చంద్రబాబు
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం పట్ల పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ దురాగతాలను ఎండగడుతోండటం వల్లే ఆయనపై దాడి చేశారని మండిపడుతున్నారు. ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేస్తోన్నారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు అమరావతి కాడె వదిలేసినట్టేనా? టీడీపీ వైఖరి పట్ల అనుమానాలు: తాత్కాలికమా?
పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు
పట్టాభిపై దాడి చోటు చేేసుకున్న ఘటన తెలిసిన వెంటనే చంద్రబాబు ఆయనకు తొలుత ఫోన్ చేశారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. పట్టాభికి ధైర్యం చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తు దాడిలో ధ్వంసమైన కారు, సంఘటనా స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సమయంలో ఆయన వెంట కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు ఉన్నారు.

జగన్ డౌన్ డౌన్ అంటూ..
దాడి చోటు చేసుకున్న సంఘటనా స్థలాన్ని పరిశీలించే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. వైసీపీ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. జగన్ కనుస్నల్లో వైసీపీ నేతలు గుండాయిజానికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. దీనితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సముద్రం ఒడ్డున బీర్ బాటిల్‌తో యంగ్ బ్యూటీ.. ఒయ్యారాలు ఒలికించిన ఆషికా రంగనాథ్

రౌడీలు రాజ్యాన్ని ఏలుతున్నారంటూ..
రాష్ట్రాన్ని రౌడీలు, గుండాలు ఏలుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. పట్టపగలు, నడి వీధిలో దాడులకు తెగబడే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆరోపించారు. పులివెందుల రాజకీయాలు ఇక్కడ చెల్లవ్ అంటూ హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అనేదే లేకుండా పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పట్టాభిపై ఇదివరకే ఒకసారి దాడి చేశారని, అప్పట్లో నిందితులను పట్టుకోలేదని గుర్తు చేశారు. అప్పుడే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు. జగన్ అండతోనే గుండాలు రెచ్చిపోతున్నారని, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

అవినీతి పాలనను ఎండగడుతున్నందునే..
వైఎస్ జగన్ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతాం అని బెదిరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదుచేస్తే కనీసం పట్టించుకోవట్లేదని చెప్పారు. పట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి, గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోందని అన్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు అదరబోమని, దాడులకు బెదరబోమని అన్నారు. వైసీపీ అరాచకపాలనని అంతమొందించి తీరుతామని నారా లోకేష్ చెప్పారు.