విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక దొంగ ముఖ్యమంత్రి అయ్యాడు: జగన్‌పై పంచుమర్తి అనురాధ ఘాటు పదాలు..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా టీడీపీ నాయకులు కొద్ది రోజులుగా చేపడుతూ వస్తోన్న ఉద్యమాన్ని వేడెక్కించారు. శుక్రవారం రైతు కుటుంబాలకు చెందిన మహిళలు తలపెట్టిన ర్యాలీకి భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

69 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి.. : వైఎస్ జగన్‌ ఘనతంటూ యనమల తీవ్ర విమర్శలు69 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి.. : వైఎస్ జగన్‌ ఘనతంటూ యనమల తీవ్ర విమర్శలు

అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, దేవినేని చందు, అమరావతి పరిరక్షణ సమితి ఐక్యకార్యాచరణ కమిటీ నాయకుడు స్వామి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధురాలు పంచుమర్తి అనురాధ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

TDP Official spoke person Panchumarthy Anuradha arrest in Vijayawada

ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్‌ను దొంగతో పోల్చారు. ఒక దొంగ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే రాష్ట్రం ఇలాగే తయారవుతుందని ఆరోపించారు. ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ విధంగా ఉంటుందనే విషయం తమకు అర్థమౌతోందని, ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలాంటి కారణం లేకుండా తమను జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు.

జగన్ ప్రతి శుక్రవారమూ సీబీఐ న్యాయస్థానం చుట్టూ తిరిగే వ్యక్తి, ఏ రోజు జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తి.. తమను అరెస్టు చేశాడని ఘాటుగా విమర్శించారు. అకారణంగా తమను అరెస్టు చేయించాడంటే రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఙప్తి చేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తే.. ముందస్తు జాగ్రత్తల కిందేనని పోలీసులు సమాధానం ఇస్తున్నారని, ఇదేమైన మావోయిస్టలు ఉండే ప్రాంతమా? అని ప్రశ్నించారు.

English summary
Telugu Desam Party Official spoke person Panchumarthy Anuradha arrest in Vijayawada. Police detained Anuradha along with Buddha Venkanna, Devineni Chanti, MLC Paruchuri Ashok Babu and some TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X