గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు..ముగిస్తా: పట్టాభి ఇంటికి వంగవీటి రాధా

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మినేని పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు కట్టు తప్పాయి. తమ పార్టీ నాయకుల నివాసాలు, కార్యాలయాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రస్థాయి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన ప్రదర్శనల సందర్భంగా పట్టాభిరామ్ నివాసం ధ్వంసమైందని, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. వారికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తమ పార్టీ నాయకులపై దాడులు పెరిగాయని ఆరోపిస్తోన్నారు. పట్టాభి రామ్ ఇంటిపై దాడి చేయడాన్ని దీనికి పరాకష్ఠగా చెబుతున్నారు.

 TDP Vangaveeti Radha visitis Pattabhi after the attacks on his residence by YSRCP

ఈ పరిస్థితుల మధ్య విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధ.. కొద్దిసేపటి కిందటే పట్టాభిరామ్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడుల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలపై ఇళ్లపై దాడి చేయడం పిరికిపందల లక్షణమని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేయడం, చిన్నపిల్లలను గురిచేయడం నీచమైన చర్యగా ఆయన పేర్కొన్నారు

రాష్ట్రంలో క్రైస్తవ సామాజిక వర్గం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని పరోక్షంగా ధ్వజమెత్తారు. గుణదల అరాచకంగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా గుణదల నీచ రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకుంటోన్నాయని వంగవీటి రాధా విమర్శించారు. పట్టాభి సహా, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం, ఇతర నాయకులు ఇళ్లపై చోటు చేసుకున్న దాడులే దీనికి నిదర్శనమని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దాడులు పెరిగాయని అన్నారు.

Recommended Video

    ఏపీని డ్రగ్స్ మాఫియాగా మార్చిన సీఎం అంటున్న టీడిపి!!

    ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంతటి హేయమైన చర్యలకు అధికార పార్టీ నాయకులు తెగించారని వంగవీటి రాధా అన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందనడానికి ఈ దాడులకు మించిన సాక్ష్యాధారాలు అక్కర్లేదని చెప్పారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని వైసీపీ నాయకులు చెలరేగుతున్నారని విమర్శించారు ఈ దాడులకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో తనకు బాగా తెలుసునని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+