ఏపీలో హాట్ టాపిక్ ..సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డిని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు . మొన్నటికి మొన్న తమ గన్నవరం నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని జగన్ కు లేఖ రాసిన ఆయన ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరారు. నియోజకవర్గ ప్రజల తాగు నీరు, సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇక తాజాగా వంశీ జగన్ ను కలవటం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video


పోలవరం ప్రధాన కుడి కాలువకు నీరిచ్చి ఆదుకోవాలని కోరిన వంశీ .. ఉచిత విద్యుత్ అందించాలని విజ్ఞప్తి
అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జగన్ ను కలిసిన వంశీ పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాలని కోరారు. అంతే కాదు కుడి కాలువ పనుల విస్తరణకు కోర్టు కేసులు కూడా వెనక్కు తీసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతులకు గత ఐదేళ్ళు గా మోటార్లతో పొలాలకు నీళ్లు అందించామని , ఇప్పుడు కూడా వారి మోటార్లకు కరెంట్ ఇవ్వాలని సీఎం ను కోరారు వంశీ. మోటర్లతో రైతుల పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం కల్పించాలని , రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించాలని కోరిన వంశీ తో సానుకూలంగా మాట్లాడారు. పాజిటివ్ గా స్పందించారు సీఎం జగన్.

తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం అన్న వంశీ .. పాజిటివ్ గా మాట్లాడిన సీఎం
ఇక అంతే కాదు తానురైతుల కోసం తన వంతు సహకారం అందించటానికి సిద్ధంగా ఉన్నానని మొన్న లేఖ రాసి తన అభిప్రాయం చెప్పారు. ఇక లేఖలో పలు అంశాలను వంశీ ప్రస్తావించారు. రైతుకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వల్లభనేని వంశీ తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్ మెయిన్ కెనాల్ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కానీ మళ్ళీ రైతులను ఒప్పించి ,ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను తీసి వేయించినట్లు గుర్తు చేశారు.
కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ లేఖలో పేర్కొన్నారు.

మొన్న లేఖ రాసి నేడు నేరుగా కలిసి రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన వంశీ
వైఎస్ హయాంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ప్రారంభమైందన్న వంశీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించే ప్రయత్నం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇక వల్లభనేని వంశీ ఈ లేఖను సంబంధితశాఖ మంత్రులకు కూడా పంపించారు గన్నవరం ఎమ్మెల్యే. అన్నదాతల సమస్యని అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక నేడు నేరుగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతుల కోసం సీఎం ను కలిసి మాట్లాడారు. వంశీ విజ్ఞప్తి పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించటం గమనార్హం .












Click it and Unblock the Notifications