చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి అధినేత చంద్రబాబును, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేసి తీవ్రపదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, వదిన ను చంపి రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమకి విలువల గురించి మాట్లాడే హక్కు లేదని వల్లభనేని వంశీ విమర్శించారు. సవాల్ కైనా, ప్రతిసవాళ్లకైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు వల్లభనేని వంశీ .

ఉమక్కకు చీర ,సారె పెడతామని ఎవరైనా పిలిచారా ?
ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని రావడానికి తాను సిద్ధంగా ఉన్నాం అంటూ ఛాలెంజ్ చేశారు. చర్చకు వచ్చే దమ్ము లేక డ్రామాలాడుతున్నారని , ఉమ అక్క అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు అంటూ వల్లభనేని వంశీ దేవినేని ఉమ పై సెటైర్లు వేశారు. ఉమక్కకు చీర ,సారె పెడతామని ఎవరైనా పిలిచారా ఏంటీ అని ప్రశ్నించిన ఆయన, దేవినేని ఉమ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

ఎంతైనా పాత సహచరులం కదా .. తేల్చుకునేవి చాలానే ఉన్నాయి
ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేవినేని ఉమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న వల్లభనేని వంశీ ఉమతో తేల్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతైనా పాత సహచరులం కదా అంటూ మాకు ఆయనకు చాలా లావాదేవీలు ఉన్నాయంటూ వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా ఇంటికెళ్ళి చర్చించటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, గతంలో కూడా ఓ మారు ఉమా ఇంటికెళ్లినా ఇంట్లో లేకుండా పారిపోయాడని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.

ఒకటి అని రెండు అనిపించుకోవటం ఉమకు అలవాటు
చర్చ పెడదామని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ మాట్లాడతాడు అని తాము అనుకోవడం లేదని పేర్కొన్న వంశీ ఒకటి అని , రెండు అనిపించుకోవడం ఉమకు అలవాటు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ అని, అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం, చంద్రబాబు తెలుగుదేశం వేరు అంటూ వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో తనకు తెలుసునని, ఉమా ఒక లోఫర్ అని మండిపడ్డారు వల్లభనేని వంశీ.
Recommended Video

చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్
వ్యవస్థను అడ్డంపెట్టుకుని చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని, చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు వల్లభనేని వంశీ .చంద్రబాబు గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వంశీ అభిప్రాయపడ్డారు . టీడీపీ గురించి, టీడీపీ నేతల గురించి తనకు అందరి కంటే ఎక్కువ తెలుసని వ్యాఖ్యానించారు .
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!











Click it and Unblock the Notifications