వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ ... వంశీ నిర్ణయం ఏంటో? జగన్ ఏం చేస్తారో !!
వల్లభనేని వంశీ పూర్తిగా రాజకీయాల నుండి తప్పు కుంటున్నారా ? లేక సీఎం జగన్ ను కలిసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారా ? అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, ప్రభుత్వ అధికారుల మీద తనను, తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నట్లు లేఖలో ఎందుకు పేర్కొన్నారు? అసలు వల్లభనేని వంశీ ఏం చేయబోతున్నారు ? గన్నవరం నియోజకవర్గంలో వైసిపిలోకి వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? జగన్ వంశీని పార్టీలో చేర్చుకుంటారా ? కృష్ణా జిల్లా రాజకీయాల్లో అసలేం జరుగుతుంది ? ఇవి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆలోచించే అంశాలు.

పండుగ రోజే షాకింగ్ నిర్ణయం చెప్పిన వల్లభనేని వంశీ
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు విషయంలో తన నిర్ణయాన్ని పండుగ తర్వాత తెలియజేస్తానని చెప్పి పండుగ రోజే షాకింగ్ నిర్ణయాన్ని తెలియజేశారు. టీడీపీకి రాజీనామా చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు వల్లభనేని వంశీ. తనను, తన అనుచరులను వైసిపి నేతలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచానని, ఇప్పటికీ తమపై వేధింపులు తగ్గలేదని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇక లేఖలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి సైతం రాజీనామా
తన ఎమ్మెల్యే పదవికి, సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి పండుగ రోజు టిడిపికి పెద్ద షాక్ ఇచ్చారు వల్లభనేని వంశీ. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే వైసీపీలో చేరాలంటే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని జగన్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం నుండి వంశీ పై పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టెన్షన్ మొదలైంది.

వంశీ వైసీపీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ
యార్లగడ్డ, వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమని ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా తన పట్టు కోల్పోతానని యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.అధిష్టానం మీద తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో తనపై, నాలుగు వేల మంది వైసిపి నేతలపై వల్లభనేని వంశీ మోహన్ కేసులు పెట్టి వేధించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వంశీని చేర్చుకోవద్దని గట్టిగానే పోరాటం చేస్తున్న యార్లగడ్డ
వంశీని పార్టీలో చేర్చుకుంటే కేడర్ మనోనిబ్బరం కోల్పోతుందని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఇక వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ లో చేరతారన్న వార్త గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. వైసీపీలో వల్లభనేని వంశీ చేరికను వ్యతిరేకిస్తూ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అధిష్టానంతో పెద్ద ఎత్తున వంశీని చేర్చు కోకుండా ఉండడం కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

భవిష్యత్ వ్యూహంపై యార్లగడ్డ , వంశీల చర్చలు .. జగన్ ఏం చేస్తారో ?
వంశీ కూడా టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను తీసుకోవాల్సిన నెక్స్ట్ ఏంటి అన్న దానిపై యార్లగడ్డ తన అనుచరులతో పెద్ద ఎత్తున సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ వ్యతిరేకత పైన కూడా వంశీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో వంశీ వైసిపి బాటే పడుతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ వంశీ రాసిన లేఖలో వైసిపి నేతలపై వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం, రాజకీయాల నుండి వైదొలుగుతానని నిర్ణయం తీసుకోవడం షాకింగ్ ట్విస్ట్. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులతో జగన్ వంశీని స్వాగతిస్తారా? యార్లగడ్డను ఒప్పిస్తా రా? ముందు ముందు ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications