విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో ఎస్సైకి కరోనా - సిటీ పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసు సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సైతం వైరస్ సోకుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ఇదే కోవలో విజయవాడకు చెందిన ఓ ఎస్సై తాజాగా కరోనా బారిన పడ్డాడు.

బెజవాడ ఎస్సైకి కరోనా...

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలకు కాపలా కాస్తున్న ఎస్సై ఒకరు విజయవాడలో కరోనా వైరస్ పాటిజివ్ గా నిర్ధారణ అయ్యారు. తాజాగా హైదరాబాద్ వెళ్లి వచ్చిన ఎస్సైకి కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. దీంతో అతనిని వెంటనే విజయవాడ కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

vijayawada sub inspector tests covid 19 positive sent to hospital

పోలీసుల్లో టెన్షన్... టెన్షన్...

Recommended Video

CM Jagan Launches Zero Interest Scheme Today
vijayawada sub inspector tests covid 19 positive sent to hospital

విజయవాడలో ఓ ఎస్సై కి కరోనా వచ్చినట్టు గుర్తించిన అధికారులు. .... ఆ ఎస్సై తో పాటు కొన్ని రోజులుగా విధులు నిర్వర్తిస్తున్న మరో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ ను కూడా క్వారంటైన్ కు పంపారు. వీరంతా నగరంలో ఒకే రూంలో అద్దెకు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరితో కలిసి పని చేసిన మరికొందరికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
A sub inspector of police in vijayawada city tested covid 19 positive in recent tests sent to govt hospital today. police personal who are roaming with his also sent to quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X