భాషా.. ఏందిది.. సర్వే పత్రాలను కాల్చివేసి.. గ్రూపులో పోస్ట్ చేసి..
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థకు ప్రయారిటీ ఉంది. ప్రభుత్వం కూడా వారి గురించి పదే పదే చెబుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వాలంటీర్లు వల్ల తప్పులు జరుగుతున్నాయి. దీనిపై దుమారం కొనసాగుతోంది. అయితే తాజాగా అలాంటి మరో ఘటన జరిగింది. ఏపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న వారి వివరాలు సేకరించి సర్వే పత్రం తయారు చేయండ కామన్.. కానీ ఓ వాలంటరీ దానిని కాల్చేశాడు. అంతేకాదు వీడియో తీసి అధికారులు, వలంటీర్లు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని, అందుకే తమలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని కామెంట్ చేశారు.
బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో ఘటన జరిగింది. వలంటీర్ భాషా ఇలా నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని వలంటీర్లను ఆదేశించింది. అలా అందరూ సేకరిస్తున్నారు. కానీ భాష మాత్రం తనలోని ప్రస్టేష్రన్ బయటపెట్టాడు.

ప్రత్యేకంగా రూపొందించిన సర్వే పత్రాన్ని వలంటీర్లకు పంపింది. సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసిన భీషా... ఆ సర్వే పత్రాన్ని కాల్చేశారు. కాలుతున్న సర్వే పత్రాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సహచర వాలంటీర్లతోపాటు అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ దుమారం రేపుతుంది. భాషాపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఇలా చేయడం సరికాదని అనేవారు కొందరు ఉన్నారు.












Click it and Unblock the Notifications