నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి; కొడుకు అప్రయోజకుడు : చంద్రబాబుపై సాయిరెడ్డి ధ్వజం
టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ యాత్ర కు పిలుపునివ్వడం పై మండిపడిన విజయ సాయి రెడ్డి నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకు పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు.
విజయసాయి రామతీర్ధం పర్యటనలో హై టెన్షన్ , కారు అద్దాలు ధ్వంసం .. లోకేష్ సవాల్ కు వైసీపీ ఎంపీ రెడీ

జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండాబాబు దబాయింపులు
జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపులకు దిగుతున్నాడని చంద్రబాబు నాయుడుపై విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబూ అంటూ రాష్ట్రంలో దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, ఆలయాల పై జరుగుతున్న దాడులు టిడిపి వల్లే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి .

బాబు పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారడంతో దిక్కుతోచడం లేదు
అంతేకాదు చంద్రబాబు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, కొడుకు అప్రయోజకుడు కావడం, భవిష్యత్తులో తాను ప్రతిపక్ష నేత కూడా కాలేనేమో అన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుండటం, పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారడంతో దిక్కుతోచడం లేదని విజయ సాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే సభ్యత, సంస్కారం గాలికొదిలేసి నోరు పారేసుకుంటున్నారు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు.

చంద్రబాబు రాజకీయంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు
చంద్రబాబు రాజకీయంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని , మతపరమైన విభజన అనే గుక్కెడు నీటితో ప్రాణాలు నిలుపుకోవాలని ఆశ పడుతున్నాడని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న ధర్మ పరిరక్షణ యాత్ర అందుకోసమే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అనుకున్నది ఎప్పటికీ నెరవేరదని సీఎం జగన్ నాయకత్వంలో ప్రజలంతా సమిష్టి శక్తితో ఐకమత్యంగా ఉన్నారని, చంద్రబాబు అపోహలను ఎవరూ పట్టించుకోవడం లేదని విజయ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.

దాడుల వెనుక ఉంది టీడీపీ నే .. టార్గెట్ చేసిన సాయి రెడ్డి
చంద్రబాబు రాష్ట్రంలో కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టే లా ప్రవర్తిస్తున్నాడని, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దాడులకు వెనక ఉండి నడిపిస్తుంది టిడిపినే అన్న అభిప్రాయం కలిగేలా చంద్రబాబును విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్నారు.
పదేపదే అదే తరహా విమర్శలకు దిగుతున్నారు . చంద్రబాబు పరిస్థితి చాలా దిగజారిపోయిందని విమర్శల వర్షం కురిపిస్తూ , ప్రతిపక్ష పార్టీని నిరంతరం డైలమాలోకి నెడుతున్నారు.