డప్పు కొట్టుకునే బాబు, లోకేష్ వింత జీవి , ఎగ్జామ్స్ పై పప్పునాయుడు నీ బాధేంటి ? సాయిరెడ్డి వ్యగ్యం
ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబుపై అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిప్పులు చెరిగే విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు విరుచుకుపడ్డారు.టిడిపి అధినేత చంద్రబాబును, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను తూర్పారబట్టారు. కరోనా విషయంలో వైఎస్సార్సీపీ సర్కార్ ను, జగన్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలకు అదిరిపోయే పంచ్ లు వేశారు సాయి రెడ్డి.
ఎన్నికల్లో చితక పొడిచారని పక్క రాష్ట్రంలో తలదాచుకున్న చంద్రబాబు
ప్రతిపక్ష నేతగా ఖజానా నుండి జీతభత్యాలు తీసుకుంటున్న చంద్రబాబుకు ప్రజల పట్ల ఏ బాధ్యత లేదా ? అని ప్రశ్నించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్నికల్లో చితక పొడిచారని పక్క రాష్ట్రంలో తలదాచుకున్నాడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటిలాగే కుల మీడియా ఏపీ ప్రభుత్వంపై పిడకలు విసురుతోంది.వీళ్లు మారరు అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ప్రజలు బాబు పట్ల తమ అభిప్రాయాన్ని ఎలాగూ మార్చుకోరు అని అభిప్రాయపడ్డారు.
లోకేష్ టెన్త్, ఇంటర్ పరీక్షలు తానే రాశాడో,ఇంకెవరితోనైనా రాయించాడో ?
నారా లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు సాయిరెడ్డి . నారా లోకేష్ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పదవతరగతి , ఇంటర్ పరీక్షలను రద్దు చెయ్యాలని , లేదా వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సాయి రెడ్డి . లోకేష్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు అంటూ నిప్పులు చెరిగారు . టెన్త్, ఇంటర్ పరీక్షలు తానే రాశాడో, లేదా ఇంకెవరితోనైనా రాయించాడో పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి .
పరీక్షలు జరిగితే నీ బాధ ఏంటి పప్పు నాయుడు ?
కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి, నీ బాధ ఏంటి పప్పు నాయుడు ? అంటూ సెటైర్లు వేశారు. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదటి ప్రకటించింది సీఎం జగన్ జగన్ గారే . ఆ తర్వాత కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది . కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే బాబుకు ఇది కనిపించలేదా.. విషం చిమ్మడమే కాదు మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

కరోనా ఉధృతి నేపధ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ... కౌంటర్లకు రివర్స్ ఎటాక్
తాజాగా కరోనా కట్టడి విషయంలో, విద్యార్థుల పరీక్షల విషయంలో టిడిపి నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న క్రమంలో విజయ సాయి రెడ్డి చంద్రబాబుకు, లోకేష్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.కరోనా వ్యాక్సిన్ లను ఫ్రీగా ఇస్తామని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కితాబిస్తూనే , కేసుల తీవ్రత ఎంతగా ఉన్నా విద్యార్థుల భవిష్యత్ నేపధ్యంలో కరోనా ప్రోటోకాల్స్ తో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు .












Click it and Unblock the Notifications