Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా కల్లోలం- 27 మందికి ఖైదీలు, 10 మంది సిబ్బందికీ..

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే పలువురు ఖైదీలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ చనిపోయాడు. కరోనా పరీక్ష నిర్వహిస్తే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పలువురు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది.

27 prisoners and 10 other staff tested covid 19 positive in visakha central jail

విశాఖ కేంద్ర కారాగారంలో ఇప్పటివరకూ 27 మంది ఖైదీలు, 10 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తాజాగా అధికారులు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఇందులో తీవ్రతను బట్టి బాధితులను క్వారంటైన్ సెంటర్లకు పంపుతున్నారు. పలువురికి అక్కడే ఉంచి హోం క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి హోం క్వారంటైన్ లో ఉండేలా ఆదేశాలు ఇస్తున్నారు. జైల్లో మిగిలిన వారికి కూడా త్వరలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+