జీపీఆర్ఎస్‌తో పావురం సంచారం: అల్లూరి జిల్లాలో కలకలం
అల్లూరి జిల్లాత విలీన మండలాల్లో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం సంచారం కలకలం రేపింది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవయ్యాయి.
విశాఖపట్నం: అల్లూరి జిల్లాత విలీన మండలాల్లో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం సంచారం కలకలం రేపింది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవయ్యాయి. జీపీఆర్ఎస్ అమర్చిన పావురాన్ని గద్ద పొడుస్తుండగా.. స్థానిక జాలర్లు కాపాడారు.
ఒక కాలికి జీపీఆర్ఎస్ అమర్చి ఉన్నట్లు జాలర్లు గుర్తించారు. ఈ పావురం ఎక్కడ్నుంచి వచ్చింది.? ఎవరు పంపించారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది మావోయిస్టుల పనా? లేక ఉగ్రవాదుల కుట్రనా? ఆకతాయిల చేష్టలా అని వారు అనుమానిస్తున్నారు.

జీపీఆర్ఎస్‌తో పావురం లభించిన నేపథ్యంలో ఆ పావురాన్ని జాలర్లు పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం ఎక్కడ్నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, పావురాలను గూఢచర్యం కోసం ఎప్పట్నుంచో వాడుతున్న విషయం తెలిసిందే. ఈ పావురం కూడా గూఢచర్యం కోసం ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.
అల్లూరి: జీపీఆర్ఎస్ అమర్చిన పావురం కలకలం pic.twitter.com/wmuzsM4AeN
— oneindiatelugu (@oneindiatelugu) February 19, 2023












Click it and Unblock the Notifications