మహిళా వార్డు వాలంటీర్‌ను కొట్టి చంపిన టీవీ రిపోర్టర్: మరొకరితో చనువుగా ఉందనే ఘాతుకం
విశాఖపట్నం: జిల్లాలోని నర్సీపట్నంలో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణంగా కొట్టి చంపాడు. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందనే అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటరిగానే ఉంటున్న మహిళా వాలంటీర్..
వివరాల్లోకి వెళితే.. నర్సీంపట్నంలోని 22వ వార్డుకు చెందిన ఓ మహిళ(35) వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు 7వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కూతురు ఉన్నారు. భర్త నుంచి విడిపోయిన ఆమె.. ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు టీవీ రిపోర్టర్ మురళి(40)తో పరిచయం ఏర్పడింది.

నాలుగేళ్లుగా సహజీవనం..
ఈ క్రమంలో మురళి, ఆమె గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా, మురళికి అప్పటికే వివాహమైంది. అయినా వీరిద్దరూ పెదబొడ్డేపల్లిలో నివాసం ఉంటూ సహజీవనం కొనసాగించారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానం మురళికి కలిగింది.

మరొకరితో చనువు ఉందనే అనుమానం..
ఆ అనుమానమే పెనుభూతంగా మారింది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే మంగళవారం సదరు మహిళ పుట్టింటికి వెళ్లగగా.. అందకుముందే మురళి అక్కడకు చేరుకున్నాడు. ఆమెతో ఘర్షణకు దిగాడు. దీంతో మద్యం సేవించి వచ్చిన మురళి తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ 100కు ఫోన్ చేసి తెలిపింది బాధితురాలు.

పోలీసులు వచ్చేలోగానే.. దారుణంగా..
పోలీసులు వచ్చేలోగానే.. మురళి ఆమెను దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. ఏఎస్పీ రిశాంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు మురళి కోసం గాలింపు చేపట్టారు. కాగా, మహిళ మృతి ఆమె కొడుకు, కూతురు అనాథలుగా మారారు.
-
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications