విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింగపూర్ టు విశాఖపట్నం: ప్రాణవాయువును మోసుకొచ్చిన ఐఎన్ఎస్ ఐరావత్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న పెను సంక్షోభంలో చిక్కుకున్నభారత్‌కు ప్రపంచ దేశాలన్నీ తమవంతు సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి సింగపూర్ వరకు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నాయి. 37 లక్షలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లందరికీ ఒకేసారి వైద్య సదుపాయాన్ని కల్పించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న ఆసుపత్రులు చాలట్లేదు. ఆక్సిజన్ అందట్లేదు. ఆసుపత్రుల్లో పడకలు కొరత వెంటాడుతోంది. చాలినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేవు. ఫలితంగా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.

Recommended Video

INS Trikand Arrives India From Qatar With Two 27 MT Oxygen Filled Containers | Oneindia Telugu

దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు ప్రపంచ దేశాలు భారత్‌కు పెద్ద ఎత్తున సహాయాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా- సింగపూర్ ఎనిమిది క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, జనరేటర్లు, వెంటిలేటర్లను భారత్‌కు పంపించింది. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ వాటిని మోసుకుని విశాఖపట్నం నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ మధ్యాహ్నం ఐఎన్ఎస్ ఐరావత్ నౌక విశాఖ పోర్ట్‌లో లంగరు వేసింది. ఎనిమిది 20 టీ క్రయోజనిక్ ట్యాంకులు, 3,150 ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణవాయులు నింపిన మరో 500 సిలిండర్లు, ఏడు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను మోసుకొచ్చిందా నౌక.

Andhra Pradesh: INS Airavat carrying medical supplies from Singapore arrives in Visakha port

దీనితోపాటు- 10,000 యాంటీజెన్ టెస్ట్ కిట్లను కూడా పంపించింది సింగపూర్. 450 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ (పీపీఈ) కిట్లను సైతం భారత్‌కు అందజేసింది. ఇదివరకు సింగపూర్ మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను పంపించింది. వాటిని ఐఎల్-76 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వైమానిక దళానికి చెందిన పానాగఢ్ ఎయిర్ బేస్ స్టేషన్‌లో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులను చూసి, ప్రపంచ దేశాలు చలించిపోతున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, కొరియా నార్వే, ఖతర్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్‌కు సహాయం అందించడానికి ముందుకొచ్చాయి.

English summary
INS Airavat arrived in Visakhapatnam with Covid medical aid on May 10. It carried eight 20 T cryogenic oxygen tanks along with other medical equipment. The Indian Navy warship also arrived with oxygen concentrators from Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X