• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ గంజాయి సామ్రాజ్యం వెనుక బడా స్మగ్లింగ్ గ్యాంగులు, 15 వేల ఎకరాల్లో సాగు, ఏపీ నుండే విదేశాలకు !!

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతున్న సమయంలో ఏపీ కేంద్రంగా గంజాయి సాగుపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మన్యంలో గంజాయి సాగు చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, 15 వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుందన్న అంచనాలు ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఏదో కొద్దో గొప్పో పంట సాగు చేస్తున్నారని అంతా భావిస్తే ఏకంగా ఒక గంజాయి సామ్రాజ్యమే ఉందన్న సమాచారం షాక్ కు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంటే, సాగును అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఏటా ఎనిమిది వేల కోట్ల విలువైన గంజాయి దేశ, విదేశాలకు అక్రమ రవాణా

ఏటా ఎనిమిది వేల కోట్ల విలువైన గంజాయి దేశ, విదేశాలకు అక్రమ రవాణా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏటా ఎనిమిది వేల కోట్ల విలువైన గంజాయిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని అనధికారిక అంచనా వేస్తున్నారు. ఇక ఈ గంజాయి విలువ జాతీయ అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి 25 వేల కోట్ల పైమాటే. ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నా ఎక్సైజ్, నార్కోటిక్స్, రెవిన్యూ, ఎస్ఈబీ అధికారులు ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక అంతే కాదు రాష్ట్రానికి సంబంధించిన స్మగ్లింగ్ ముఠా లే కాదు, ఏపీ నుండి సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ వెనుక ఇతర రాష్ట్రాల ముఠాలు కూడా ఉన్నాయనేది వెలుగులోకి వస్తోంది.

ఏపీ కేంద్రంగా గంజాయి దందాలో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ గ్యాంగులు

ఏపీ కేంద్రంగా గంజాయి దందాలో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ గ్యాంగులు

మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠాలు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా సాగవుతున్న గంజాయిని దేశంలోని నలుమూలలకూ చేర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. రోడ్డు, రైలు మార్గాల ద్వారా నిత్యం వేల టన్నుల గంజాయి అక్రమ రవాణా జరుగుతోందంటే స్మగ్లింగ్ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విశాఖ మన్యంలో వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించింది. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన మాదకద్రవ్య ముఠాలు వేల కోట్లను సంపాదిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండు ఉన్న శీలావతి రకం గంజాయి సాగు ఇక్కడ జరగడంతో గంజాయి స్మగ్లర్ల కన్ను ఏపీ పై పడింది.

ఏపీ గంజాయి చేరుతున్న రాష్ట్రాలివే .. విదేశాలకు రవాణా

ఏపీ గంజాయి చేరుతున్న రాష్ట్రాలివే .. విదేశాలకు రవాణా


ఇటీవల కాలంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నా, అది కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే అని తెలుస్తుంది. వివిధ రవాణా మార్గాల ద్వారా, గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా ఏపీలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు అవుతున్న గంజాయి ఏపీ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర కు చేరుతుంది. అక్కడి నుండి ఈశాన్య రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, తమిళనాడు, కేరళ, చెన్నై, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విశాఖ ఏజెన్సీ వేదికగా సాగు చేస్తున్న గంజాయి చేరుతుంది. చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంకకు ఇతర దేశాలకు గంజాయి అక్రమ రవాణా అవుతుందని సమాచారం. విదేశాలలో సైతం ఏపీ విశాఖ మన్యంలోని గంజాయికి భారీగా డిమాండ్ ఉందంటే ఏపీలో మాదకద్రవ్యాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు?

రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు?

ఏపీ నుండి జరుగుతున్న గంజాయి దందాలో మహారాష్ట్రకు చెందిన కాలే గ్యాంగ్, పవార్ గ్యాంగులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటే ఏపీలో మాదకద్రవ్యాల మత్తు ముఠాల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటుంటే, ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో యధేచ్ఛగా సాగు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు గంజాయి సాగును ఆదిలోనే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న.

ఎక్సైజ్, నార్కోటిక్స్, ఎస్ఈబీ ఏం చేస్తుంది ప్రభుత్వం కట్టడి చెయ్యలేదా ?

ఎక్సైజ్, నార్కోటిక్స్, ఎస్ఈబీ ఏం చేస్తుంది ప్రభుత్వం కట్టడి చెయ్యలేదా ?

గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులు వేల ఎకరాల్లో గంజాయి సాగుతుంటే ఏం చేస్తున్నారు అన్నది మరో ప్రశ్న. గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై దృష్టిసారించి కట్టడి చేయాల్సిన నార్కోటిక్స్ అధికారులు విశాఖ ఏజెన్సీలో సాగుతున్న గంజాయి దందాను ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది ఇంకో ప్రశ్న. అక్కడ పోలీసులు ఎందుకు ఈ వ్యవహారంపై దృష్టి ఎందుకు పెట్టటం లేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని చెబుతున్న ఏపీ సర్కార్ ఎందుకు విశాఖ ఏజెన్సీలో గంజాయిని కట్టడి చేయలేక పోతున్నది అసలైన ప్రశ్న.

  Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu
  గంజాయి సాగు, సూత్రధారులపై ఫోకస్ చెయ్యాలి .. లేదంటే కష్టమే

  గంజాయి సాగు, సూత్రధారులపై ఫోకస్ చెయ్యాలి .. లేదంటే కష్టమే

  వాహన తనిఖీలు చేసి, గంజాయి అక్రమరవాణా చేస్తూ దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కట్టడికి ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, విశాఖ మన్యం గ్రామాలలో గంజాయి సాగు ఎందుకు జరుగుతుంది? ఎంత మేరకు గంజాయి సాగు చేస్తున్నారు? గిరిజనులు ఎందుకు గంజాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు? దీని వెనుక వున్న సూత్రధారులు ఎవరు? అన్న అంశాలపై దృష్టిసారించడం లేదనేది ప్రధానమైన అంశం. ఏదేమైనప్పటికీ ఏపీ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతుందని పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతున్న సమయంలో, ఏపీలో గంజాయి సాగు, దేశవిదేశాలకు రవాణా అవుతున్న గంజాయి దందాపై ఆసక్తి నెలకొంది. ఇంత పెద్ద ఎత్తున గంజాయి దందా జరుగుతుంటే ముందు ముందు ఏపీ పరిస్థితి ఏంటి? అన్న చర్చ జరుగుతోంది.

  English summary
  Drug dealing in Andhra Pradesh is hot topic now. Cannabis cultivation on 15,000 acres, valued at over Rs 25,000 crore in the international market, is currently discussion in AP Circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X