విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదన్న కేంద్రం !!

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర వైఖరి మాత్రం మారడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాలు సాగుతున్నా, జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రంగం సిద్ధమవుతున్నా కేంద్రం మాత్రం పట్టిన పట్టు విడవడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన చేసేది లేదని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం బల్లగుద్ది మరీ చెబుతోంది.

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి

ఈరోజు లోక్ సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్ వేదికగా వైసిపి ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం, తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కూడా అదే సమాధానమిచ్చింది.

Recommended Video

Vizag Steel Plant : కార్మికుల పోరాటం ఉధృతరూపం.. జగన్ సర్కార్ పై ఒత్తిడి..!!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో పునరాలోచన లేదని స్పష్టం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో పునరాలోచన లేదని స్పష్టం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రెండో ఆలోచనే లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించాయి. పాదయాత్రలు, బైక్ ర్యాలీలతో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమం

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమం


విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా, ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 1 , 2 తేదీలలో ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఇటీవల విశాఖ కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో సాగుతున్న కార్మికుల ఆందోళనలు 165 రోజుకు చేరుకున్నాయి. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఆందోళనలు విరమించేది లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తేల్చి చెబుతున్నారు.

English summary
Union Minister Bhagwat Kishan Rao Karad gave a written reply to a question by YSRCP MP Gorantla Madhav in the Lok Sabha on the privatization of the Visakhapatnam steel plant. Replying to a question by MP Gorantla Madhav the Center said it had not reconsidered the privatization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X