విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్డర్‌లో చెలరేగిన మంటలు, భారీగా ఆస్తినష్టం...
విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చేపలబోటులో మంటలు చెలరేగాయి. సముద్రంలోనే ఆ బోటు తగలబడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారని.. వారు సముద్రంలోకి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ కొంత గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. హార్బర్‌లో ఓ బోటు శనివారం ఉదయం 5 గంటలకు చేపల వేటకు వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో బోటులో ఉన్న వారు పట్టిన చేపలను వేరు చేస్తున్నారు ఈ సమయంలో ప్రమాదం జరిగిందిని తెలుస్తోంది.
బోటులో మంటలను చూసిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లారు. పోర్టు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ బోటులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉందని.. కానీ అదీ పేలలేదని తెలుస్తోంది. లేదంటే ఘోర ప్రమాదం జరిగేదని ఆందోళన చెందుతున్నారు.

Recommended Video
మంటలకు బోటు ఇంజిన్, క్యాబిన్ దగ్ధమైంది. దీంతో రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ విశాఖలో వరుస ప్రమాదాలు జరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications