దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చారు.. జగన్‌పై అయ్యన్న ఫైర్
సమయం దొరికితే చాలు జగన్ సర్కార్ లక్ష్యంగా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. విధానపర అంశాల గురించి ప్రస్తావిస్తూ.. టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ముందు ఉంటారు. ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సీఎం జగన్ సేవలో తరించేందుకు పోలీసులతోపాటు సీఐడీ కూడా అందుబాటులో ఉందని మండిపడ్డారు. అందుకోసమే టీడీపీ శ్రేణులు, కార్యకర్తలను కూడా వదలడం లేదని ఫైరయ్యారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ అధికారులను వేధింపులకు జగన్ సర్కార్ గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్నేహితుడి పరామర్శకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై కేసులు పెట్టడం సరికాదని కామెంట్ చేశారు. దీంతో పరామర్శకు వెళ్లడానికి జనం భయపడే పరిస్థితి నెలకొందని వివరించారు. మంచి చెడు కనుక్కొవడం సహజమని.. కానీ దానిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని వేధించడమే తగదన్నారు.

సీఎం జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు. ఆయన చెప్పినట్టు ఏజెన్సీ పనిచేస్తుందరి వివరించారు. సీఎం జగన్‌రెడ్డిని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టేందుకే సీఐడీ పనిచేస్తోందన్నారు. ఇదీ చాలా సందర్భాల్లో రుజువు అయ్యిందని తెలిపారు. సీఐడీ ఎజెండాను వైసీపీ పెద్దలు సెట్ చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు కామెంట్స్ చేశారు. సీఐడీ దర్యాప్తు సంస్థను దిగజార్చిన ఘనత సీఎం జగన్‌రెడ్డికే దక్కుతుందని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలీసులు పనిచేస్తుంటారు. సీఐడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తారు. కానీ వారిని కూడా రాజకీయాలకు అపాదించడం సరికాదు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం.. వారిని వాడటం.. ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతూనే ఉంటుంది. ఈ సారి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. జగన్ సర్కార్ లక్ష్యంగా అటాక్ చేశారు.












Click it and Unblock the Notifications