ఎన్జీటీ ఆదేశాలను, ఏడు కమిటీల ఏర్పాటును సవాల్ చేసిన ఎల్జీపాలిమర్స్ .. సుప్రీంలో ఆసక్తికర వాదన

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటనపై వివరణ కోరుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చెయ్యటంతో పాటు ప్రాణ నష్టం కోసం రూ .50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని డిపాజిట్ చెయ్యాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన విషయం తెలిసిందే . ఇక ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ, అలాగే గ్యాస్ లీక్ ఘటనపై 7 విచారణ కమిటీల ఏర్పాటును సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సుప్రీం ధర్మాసనాన్నిఆశ్రయించింది . ఇక ఈరోజు ఈ పిటీషన్ పై విచారణ జరిగింది.

నోటీసులు ఇవ్వటానికి తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం

నోటీసులు ఇవ్వటానికి తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం


జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి . వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్జీటీలో వాదనలు వినిపించాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఆదేశించింది. అంతేకాదు నోటీసులు ఇవ్వకుండా తిరస్కరించి పెట్టి తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది . ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో లేని అంశం అని ఎల్జీ పాలిమర్స్ తరపున ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు . అయితే విషవాయువు లీకేజ్ దుర్ఘటన కచ్చితంగా పర్యావరణ అంశం అని ఎన్జీటీ పరిధిలోకే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది .

విచారణకు ఏడు కమిటీలు అవసరమా ? ఒక్క కమిటీ చాలని వాదన

విచారణకు ఏడు కమిటీలు అవసరమా ? ఒక్క కమిటీ చాలని వాదన

అంతేకాదు ఇక విషవాయువు లీకేజీ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు మొత్తం 7 కమిటీలను వేశారని, అన్ని కమిటీల విచారణ అవసరమా ?కేవలం ఒక్క కమిటీ విచారణ చాలన్నదే మా వాదన అని ఎల్జీ పాలిమర్స్ తరపున ముకుల్ రోత్గి వాదించారు . సుమోటోగా ఇలాంటి అంశాలపై ఎన్జీటీ ఆదేశాలు జారీచేయడం, విచారణ జరపడం చేయవచ్చా అన్నదే మా ప్రశ్న అని ఆయన సుప్రీం ధర్మాసనం ముందు తమ వాదన ఉంచారు ముకుల్ రోత్గి.

Recommended Video

    Vizag Gas Leak: LG Polymers' Application for Environmental Permit, Environmental Clearance Confusion
    ఎన్జీటీ లో తమ వాదన వినిపించాలని సూచించిన సుప్రీం కోర్ట్

    ఎన్జీటీ లో తమ వాదన వినిపించాలని సూచించిన సుప్రీం కోర్ట్


    అయితే ఆర్‌ఆర్ వెంకటపురంలోని తన ప్లాంట్‌లో గ్యాస్ లీక్‌పై దర్యాప్తు జరిపేందుకు ఏడు కమిటీలను వేయటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపి కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, సెంట్రల్ పిసిబి, కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే జూన్ 1వ తేదీన ట్రిబ్యునల్ జరిపే తదుపరి విచారణలో వాదనలు వినిపించుకొనేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది సుప్రీంకోర్టు . ఎన్జీటీ ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న కారణంగా జూన్ 1న తదుపరి విచారణ ఉన్నందున, ఈ లోగానే చట్టపరమైన పలు అంశాలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను వివరించాలని ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+