భార్యల పాదపద్మముల సాక్షిగా మహిళా దినోత్సవం.. ఎక్కడో కాదు వైజాగ్ లోనే

భార్యలను హింసించే వారే కాదు, గౌరవించేవారు, పూజించే వారు కూడా భారత దేశంలో ఉన్నారు. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అంటారు. ఎక్కడస్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్నది ఆర్యోక్తి. ఆ మాటను తూ.చ తప్పకుండా పాటించారు స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు.

ఇంతకీ ఎక్కడ అంటారా... ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో భార్యకు పాదాభివందనం అంటూ పాద పూజ చేశారు.

On womens day husbands honoured wifes with paadapooja ...you know where it is in Vizag

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పాతనగరంలోని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద ప్రేమ సంస్థ సభ్యులు తమ భార్యలను కార్యాలయానికి ఆహ్వానించారు. అసలు భర్తలు తమ ని ఎందుకు పిలిచారో తెలియని భార్యలు తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తమ భర్తలు చేసిన పనికి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా.. భార్యలను కూర్చోబెట్టి పాదాలను కడిగి పాదపూజ నిర్వహించారు.

రామకృష్ణ పరమహంస కూడా తన భార్య శారదాదేవిని పూజించారని, భార్యను గౌరవించటం, పూజనీయం గా చూడటం అవసరమని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. తల్లిగా, చెల్లి గా, భార్యగా, అక్కగా, కూతురుగా,స్నేహితురాలిగా మన జీవితంలో ఎన్నో విధాలుగా వెలుగునిచ్చే స్త్రీ మూర్తులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని సంస్థ సభ్యులు తెలిపారు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భార్య పాదపద్మములు సాక్షిగా మహిళల పట్ల తమకున్న పూజ్య భావాన్ని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+