విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో పవన్ కళ్యాణ్ సభ; ఆసక్తికర ట్వీట్ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 31వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న విశాఖ ఉక్కు పోరాటంలో భాగంగా ఉక్కు పరిరక్షణా సభలో పాల్గొననున్నారు. ఈమేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేయడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారని, బీజేపీతో పవన్ కళ్యాణ్ కు స్నేహబంధం తెగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ విశాఖకు వెళ్లనున్న నేపధ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న సమయంలో ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నుండి స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ బాట పట్టారు. జనసేన పార్టీ ప్రజా పక్షం వహిస్తుందని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న అని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఆందోళన తీవ్రతరం చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండదండలు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్ పోరాటానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపటం పట్ల లక్షీనారాయణ ట్వీట్

స్టీల్ ప్లాంట్ పోరాటానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపటం పట్ల లక్షీనారాయణ ట్వీట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు సంఘీభావం తెలపడం పట్ల సీబీఐ మాజీ జేడీ, మాజీ జనసేన నాయకుడు లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకునేలా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ హ్యాష్ ట్యాగ్ తో #savevizagsteelplant పేరుతో సోషల్ మీడియా వేదికగా తన సంఘీభావాన్ని వెల్లడించారు లక్ష్మీనారాయణ. పవన్ చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఆయన స్పందించారు.

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్షీ నారాయణ .. గతంలోనే మోడీకి లేఖ

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్షీ నారాయణ .. గతంలోనే మోడీకి లేఖ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ పై గతంలోనే తన స్పందన తెలియజేశారు. ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేఖ రాశారు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉందని పేర్కొన్న సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు. ఎగుమతి దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా విశాఖను పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని స్పష్టం చేశారు. లేఖలో కొన్ని ప్రధానమైన సూచనలు చేశామని ఆ సూచనలు అమలు చేస్తే మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావచ్చని మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కు ని తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని చెప్పిన లక్ష్మీనారాయణ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సూచించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల గుండెచప్పుడు అని, దీనిని మిగతా సంస్థలతో కలిసి చూడకుండా భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరించకుండా కేంద్రం విశాఖ ఉక్కు ను తమ చేతుల్లోనే ఉంచుకుంటే మంచిది అని సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

పవన్ స్టీల్ ప్లాంట్ సభపై సర్వత్రా ఆసక్తి .. బీజేపీకి టెన్షన్

పవన్ స్టీల్ ప్లాంట్ సభపై సర్వత్రా ఆసక్తి .. బీజేపీకి టెన్షన్

ఒకపక్క బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఆదివారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సభలో ఏం మాట్లాడుతారు అన్నదానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, ఏపీలో బీజేపీ మరింత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే రెండు పార్టీల మధ్య మితృత్వం దెబ్బతింది అన్న భావన వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే మీకు మీరే మాకు మేమే అన్న చందంగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయన్న చర్చ జరుగుతుంది.

 విశాఖలో ఏర్పాట్లలో జనసేన బిజీ .. కరపత్రాలు పంచుతూ ఏర్పాట్లలో జనసైన్యం

విశాఖలో ఏర్పాట్లలో జనసేన బిజీ .. కరపత్రాలు పంచుతూ ఏర్పాట్లలో జనసైన్యం

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ కార్యకర్తలు కరపత్రాలను పంచుతూ ఆరు నూరైనా సభ జరిపి తీరుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు . మొదట కూర్మన్నపాలెం ఆర్చి వద్ద సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు . పోలీసులు సభా వేదికను మార్చాలని జనసేన నాయకులకు సూచించగా జనసేన నాయకులు ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మొత్తానికి అక్టోబర్ 31న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖకు వెళ్ళనుండడం ఆసక్తికరంగా మారింది.

English summary
Pawan Kalyan will take part in the steel conservation meeting on May 31 as part of the ongoing Visakha steel struggle against the privatization . Former CBI JD Lakshmi Narayana made an interesting tweet on Pawan Steel Plant supporting decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X