Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రుషికొండలో అక్రమ మైనింగ్ లేదన్న జగన్ సర్కార్-భారతీ సిమెంట్ లేటరైట్ కొనుగోళ్లపైనా..

ఏపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విశాఖలోని రుషికొండను తవ్వేస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్ష నేత చంద్రబాబు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఇవాళ రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో వివరణ ఇచ్చారు. బాబువి చౌకబారు ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, తమ ప్రభుత్వం పలు సంస్కరణలు చేప్టటి, తత్ఫలితంగా మైనింగ్ శాఖకు దేశంలోనే మూడవ బెస్ట్ ర్యాంకు సాధిస్తే.. రాష్ట్రంలో కొండల్ని, చెరువులను తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే మీడియా ముందుకు వచ్చామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రుషి కొండలో ఎటువంటి అక్రమాలు జరగలేదన్నారు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన ప్రకారమే అక్కడ మట్టి తవ్వకాలు జరిగాయన్నారు. ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్లు రాయిల్టీ కూడా చెల్లించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

peddireddy ramachandra reddy refute chandrababus rushikonda mining allegations

అసలు చంద్రబాబు రుషికొండ ఎందుకు పోవాల్సి వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రుషికొండలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ కోర్టుకు వెళ్లింది కూడా ఆయనేనన్నారు. రుషికొండలో నిబంధనల మేరకే పనులు జరిగాయని, నిర్దేశిత స్థలం కంటే ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిగాయన్న అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం చంద్రబాబు నాయుడు నైజమని ఆయన ఆరోపించారు. రుషికొండపై గతంలో అక్రమాలకు పాల్పడివారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నామన్నారు.

చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలోనే మైనింగ్ అక్రమాలు జరిగాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఫారెస్ట్‌ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్‌లు జరిగాయన్నారు. వాటిని మేం అధికారంలోకి వచ్చాక నిలుపుదల చేశామన్నారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు 75 అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో.. ఆ లీజులన్నీ ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వంతో పాటు అంతకుమందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు.

peddireddy ramachandra reddy refute chandrababus rushikonda mining allegations

కుప్పంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే మైనింగ్ లీజులు ఇచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం రెండు లీజులకు మాత్రమే అనుమతి ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు.తమ హయాంలో తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. అక్రమ మైనింగ్ కు ఎవరు పాల్పడినా జరిమానాలు విధిస్తున్నామన్నారు. భారతీ సిమెంట్స్ రోజుకు 1000 లారీల లైటరైట్ కొనుగోలుచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, కానీ ఏ సిమెంట్ కంపెనీ కూడా రోజుకు అంత లేటరైట్ వాడదని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+