ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపుపై నిరసన .. మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలన్న సినీ దర్శకుల సంఘం
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విగ్రహాలను తొలగించారు జీవీఎంసి అధికారులు . విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని , విగ్రహాల ఏర్పాటు వల్ల స్థానికంగా ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని చేసిన ఆందోళన ఫలితంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల విగ్రహాల తొలగింపు చేసింది జీవీఎంసి .
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో సోమవారం అర్థరాత్రి మూడు విగ్రహాలను జీవిఎంసి అధికారులు కూల్చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుతో పాటు తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ విగ్రహాలను తొలగించారు . అయితే సినీ ప్రముఖుల విగ్రహాలను తొలగించటంపై ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం ఆందోళనకు దిగింది.

సినీ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు , దాసరి నారాయణ రావు ,హరికృష్ణ విగ్రహాలు తిరిగి ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసింది. సినీ పరిశ్రమకు విశేషమైన సేవలందించిన వీరి విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు, హరి కృష్ణలు ముగ్గురూ కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారని వారి విగ్రహాలు తిరిగి ఏర్పాటు చెయ్యకుంటే ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుందని వారన్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications