Kingpin: అరకులో అడ్డా, భార్యను పంపించి బుక్కైపోయిన కోటేశ్వర్ రావ్, రూ. 8 కోట్ల డ్రగ్స్ సీజ్, ఐటీ హబ్ లో!
బెంగళూరు/వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లోని అటవి ప్రాంతంలో గంజాయి పండించి గుట్టుచప్పుడు కాకుండా ఐటీ హబ్ లో విక్రయిస్తున్న నలుగురు మహిళలతో పాటు ఓ విదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించే ముఠా నాయకుడు జస్ట్ మిస్ అయినా అతని భార్య మాత్రం పోలీసులకు చిక్కిపోయింది. డ్రగ్స్ కింగ్ పిన్ వైజాగ్ కోటేశ్వర్ రావ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకుల గెటప్ తో వెళ్లిన పోలీసులు సినిమా ఫక్కీలో డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళలను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 7. 80 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

రూ. 7.80 కోట్ల డ్రగ్స్ సీజ్
బెంగళూరు సిటీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పిన్ వైజాగ్ కోటేశ్వర్ రావ్ భార్య పాంగి పూర్ణమ్మ, కుడేరి పుష్పా, గుడి విజయా, దేవి, నైజీరి దేశానికి చెందిన జాన్ అలియాస్ డేవిడ్ అనే ఐదు మందిని అరెస్టు చేసి రూ. 7. 80 కోట్ల విలువైన 8 కేజీల హ్యాషిక్ ఆయిల్, 10 కేజీల గంగాయి, 1 కేజీ ఎండీఎంఏ క్రిస్టల్ సీజ్ చేశారు.

కోటేశ్వర్ రావ్ ఎస్కేప్
పోలీసులు దాడులు చేసే సమయంలో డ్రగ్స్ కింగ్ పిన్ కోటేశ్వర్ రావ్ జస్ట్ తప్పించుకుని పారిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు. కోటేశ్వర్ రావ్ తప్పించుకున్నా అతని భార్య పూర్ణమ్మ అండ్ కో మాత్రం పోలీసుకు చిక్కిపోయారు. కోటేశ్వర్ రావ్ కోసం బెంగళూరు సిటీ పోలీసులు గాలిస్తున్నారు.

అరకు, చింతపల్లిలో అడ్డా
ఆంధ్రప్రదేశ్ లోని అరకు, చింతపల్లి అటవి ప్రాంతంలో కోటేశ్వర్ రావ్ అతని అనచరులు పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారని బెంగళూరు పోలీసులు అంటున్నారు. అరకు, చింతపల్లిలోనే గంజాయితో హ్యాశిష్ ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్ బెంగళూరు తీసుకు వచ్చి సీక్రేట్ గా డ్రగ్స్ డీలర్స్ కు విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు.

డీజేతో మ్యాటర్ లీక్
మమూలుగా డ్రగ్స్ కోనుగోలు చేసే వారికి తప్పా కోటేశ్వర్ రావ్ బయటి వ్యక్తులకు డ్రగ్స్, గంజాయి విక్రయించడని బెంగళూరు పోలీసులు తెలుసుకున్నారు. ఇటీవల బెంగళూరులో వివేక్ నగర్ లో డీజేని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి సమాచారం సేకరించారు. డీజే ఇచ్చిన సమాచారంతో కోటేశ్వర్ రావ్ అండ్ కో విషయాలు బయటకు వచ్చాయి.

గోవా గెటప్స్ తో వెళ్లి
గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకుల గెటప్స్ తో వెళ్లిన బెంగళూరు పోలీసులు మాకు డ్రగ్స్ కావాలని కోటేశ్వర్ రావ్ ను కలిశారు. పుట్టపర్తి బస్ స్టాప్ దగ్గరకు మీరు వస్తే మా వాళ్లు వచ్చి మీకు డ్రగ్స్ ఇస్తారని కోటేశ్వర్ రావ్ చెప్పాడు. బస్ స్టాండ్ లో డ్రగ్స్ తీసుకుని వచ్చిన నలుగురు మహిళలను సినిమా ఫక్కీలో పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో డీల్ కావడంతో కోటేశ్వర్ రావ్ అతని భార్య పూర్ణమ్మను వెంటపంపించి బుక్కైపోయాడని పోలీసులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications