విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాన్సాస్ లో డ్యూటీ మొదలుపెట్టేసిన సంచైత.. తొలి నిర్ణయమే వివాదాస్పదం...

|
Google Oneindia TeluguNews

సంచలన రీతిలో విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు బాధ్యతలను చేపట్టిన సంచైత గజపతిరాజు తన తొలి నిర్ణయంతో మరో సంచలనం రేపారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఆమె ఇచ్చిన అనుమతులతో అక్కడికి వెళ్లిన అధికారులను స్ధానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

 సంచైత తొలి ఆర్డర్...

సంచైత తొలి ఆర్డర్...

విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సంచైత గజపతిరాజు అప్పుడే పని మొదలుపెట్టేశారు. మాన్సాస్ ట్రస్టుకు చెందిన ఆస్తుల పరిరక్షణ చేపడతానని హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా తీసుకున్న తొలి నిర్ణయం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సమీపంలో విజయనగరం జిల్లా పూసపాటి రాజవంశీయుల మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన సుమారు 300 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో ఇసుక తవ్వకాలకు మాన్సాస్ ట్రస్టు తాజాగా అనుమతి ఇచ్చింది.

మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలు

మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలు

ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలోని మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాల కోసం మూడు జేసిబిలతో అధికారులు వచ్చారు. ఇందులో ఏపీఎండీసీతో పాటు మాన్సాస్ ట్రస్టు అధికారులు కూడా ఉన్నారు. దీంతో వారిని స్ధానిక రైతులు అడ్డుకున్నారు. జేసీబీలను ముందుకెళ్లకుండా అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. అధికారులు సర్దిచెప్పినా రైతులు వినలేదు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

ఉపాధి దెబ్బతింటోందని...

ఉపాధి దెబ్బతింటోందని...

అయినవిల్లిలోని 300 ఎకరాల మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల తమ ఉపాధి కోల్పోవడంతో పాటు, లంక గ్రామాలు నదీ కోతకు గురవుతాయని రైతులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు.. అక్కడే దర్నాకు దిగారు. రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన కె.గంగవరం పోలీసులు
వారిని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత మాన్సాస్ భూముల్లో పోలీసు పహారాలో ఇసుక తవ్వకాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Recommended Video

YSRCP MP Raghu Rama Krishnam Irritated By Jagan Fans | నోరు జారిన రఘు రామ కృష్ణం రాజు | Watch Video
ఇసుక తవ్వకాలపై గతంలోనూ వివాదాలే...

ఇసుక తవ్వకాలపై గతంలోనూ వివాదాలే...

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తాజాగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును తప్పించి సంచైత గజపతి రాజును ప్రభుత్వం నియమించి వారం రోజులు తిరగక ముందే ఇసుక త్రవ్వకాలు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇసుక త్రవ్వకాలకు ప్రయత్నం చేసినప్పటికీ మాన్సాస్ ట్రస్ట్ తో పాటు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పడంతో అప్పట్లో అధికారులు వెనక్కి తగ్గారు. తిరిగి సంచైత బాధ్యతలు చేపట్టాక ఇసుక తవ్వకాలు ప్రారంభం కావడంపై రైతులు మండిపడుతున్నారు.

English summary
mansas trust chairperson sanchaita gajapathi raju starts her duties recently and her decision on mansas lands in eastgodavari become controversial. as per the latest orders, sand minining started in mansas trust lands in east godavari district and local farmers opposed it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X