విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక షాకింగ్ ట్విస్ట్ .. ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్లకు టోకరా !!

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు అదృశ్యం వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఈ కేసులో చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టిన సమయంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకి ఇప్పటి వరకు లభించలేదు.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి .

ఉద్యోగాల పేరుతో శ్రీనివాసరావు మోసం .. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో బాధితుల ఒత్తిడి

ఉద్యోగాల పేరుతో శ్రీనివాసరావు మోసం .. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో బాధితుల ఒత్తిడి

ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ రాసి శనివారం నుండి కనిపించకుండా పోయిన శ్రీనివాసరావు అదృశ్యం వెనుక అసలు కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, అతని వ్యక్తిగత వ్యవహారమని పోలీసులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి శ్రీనివాసరావు భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల కోసం శ్రీనివాసరావుకు డబ్బులు ఇచ్చినవారు, తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శ్రీనివాసరావుపై ఒత్తిడి తెస్తున్నారు.

 ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాసరావు కొత్త డ్రామా .. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాసరావు కొత్త డ్రామా .. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఈ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీనివాస రావు ఆత్మహత్య డ్రామాకు తెరతీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాదాపుగా శ్రీనివాసరావు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండు కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస రావు అదృశ్యం తర్వాత చాలామంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాల కోసం శ్రీనివాసరావు డబ్బులు ఇచ్చినట్లుగా తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకున్నారు.

ఒకపక్క శ్రీనివాసరావు కాల్ డేటాను సేకరిస్తున్న పోలీసులు అతని ద్వారా ఎంత మంది నిరుద్యోగులు మోసపోయారు అన్న డేటాను సేకరిస్తున్నారు.

16 మందికిపైగా నిరుద్యోగులను మోసం చేసిన శ్రీనివాసరావు .. పోలీసుల విచారణ

16 మందికిపైగా నిరుద్యోగులను మోసం చేసిన శ్రీనివాసరావు .. పోలీసుల విచారణ


ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ రాసిన శ్రీనివాసరావు కనిపించకుండా పోయిన నేపథ్యంలో అప్పటి నుండి అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, శ్రీనివాసరావు కాల్ డేటాను ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు . శ్రీనివాస రావు దాదాపు 16 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేశారని పోలీసులు చెప్తున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన శ్రీనివాసరావు బాధితుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కొత్త డ్రామాకు తెరతీశారు అని కార్మిక వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

English summary
Police have identified the real reason behind the disappearance of Srinivasa Rao, who has been missing since Saturday after writing a suicide note to commit suicide, as his personal affair, not the privatization of the Visakhapatnam steel plant. In fact, the police found that Srinivasa Rao had extorted huge sums of money from the unemployed to give them jobs in the steel plant.In the wake of the privatization of the Visakhapatnam steel plant, those who gave money to Srinivasa Rao are pressuring Srinivasa Rao to return their money. Police say this pressure has opened the door to new drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X