మంచు కురిసే వేళలో.. వలిసెపూల అందాలతో అరకులోయ; ప్రకృతి సోయగాల అద్భుతం; పర్యాటకులు ఫిదా!!
విశాఖ మన్యంలో పర్యాటకుల సందడి కొనసాగుతోంది. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయ పర్యాటకులతో సందడిగా మారింది. ప్రకృతి సహజసిద్ద అందాలకు నిలయమైన అరకులోయలో ప్రస్తుతం పొగమంచు దట్టంగా కురుస్తుంది. మంచు కురిసే వేళలో మన్యం అందాలు, ప్రకృతి సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటాయి.ఇక ఈ కాలంలోనే పూసే వలిసే పూలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి.

మంచు కురిసే వేళలో అరకు అందాలకు ముగ్దులవుతున్న పర్యాటకులు
ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న పొగమంచు, మేఘాలు భూమిని తాకుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేస్తుంటే ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే వారు అరకులోయ మంచు అందాలకు ముగ్ధులై పోతున్నారు. గజగజ వణికి పోయే చలిలోనూ సంతోషంతో తడిసి ముద్దవుతున్నారు. ఆంధ్రా ఊటీ అని పేరెన్నిక గన్న అరకులోయలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ పర్యాటకులు మాత్రం ఈ సీజన్లో అరకు అందాలను చూడడానికి అరకుకు క్యూ కడుతున్నారు.

ఎత్తైన కొండలు, జలపాతాలు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తున్న అరకు
అరకులోయలో వేకువజామున దర్శనమిచ్చే మంచు మేఘాలు పాలసముద్రాన్ని తలపిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇక అరకులోయ సమీపంలో ఉన్న మాడగడ గ్రామం వద్ద ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న మంచు అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోంది. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న కాశ్మీర్ కి వెళ్లే బదులు, అద్భుతమైన అరకు అందాన్ని చూస్తే చాలు అన్న భావన చాలామందికి కలుగుతుంది. ఇదిలా ఉంటే డుంబ్రిగూడ మండలం లోని వలిసె పూలు పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. కేవలం శీతాకాలంలోనే పూసే ఈ పూలు అరకు కు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఈ సీజన్ లో పూసే వలిసె పూల అందాలు, చాపరాయి జలవిహారి అదరహో
దేశం నలుమూలల నుండి పర్యాటకులు ఈ సీజన్లో ఈ వలిసె పూల అందాలను చూడడానికి అరకు వస్తుంటారు. సహజసిద్ధమైన అందాలతో సందర్శకులను ఇట్టే ఆకర్షించే ఆంధ్రా ఊటీ తన అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు డుంబ్రిగూడ మండలం లోని చాపరాయి జలవిహారి లో కూడా పర్యాటకుల సందడి నెలకొంది. చాపరాయి జలవిహారితో పాటు అరకు కాఫీ, గిరిజన మ్యూజియం కూడా పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. పాడేరు సమీపంలోని వంజంగి కొండలు కూడా పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి .

వంజంగి కొండలపైన పర్యాటకుల సందడి .. మంచు కైలాసంలో ఉన్నట్టు ఫీల్
వంజంగి కొండల పైభాగాన పర్యాటకులు దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో మంచు కైలాసంలో తేలియాడుతున్న భావనను పొందుతున్నారు. అద్భుతమైన ప్రకృతి అందానికి ఫిదా అవుతున్నారు. గజ గజ వణుకుతున్న చలిలోనే ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ పరవశించి పోతున్నారు. నిన్న మొన్నటి వరకు కరోనా మహమ్మారి భయంతో విలవిలలాడిన ప్రజలు ఇటీవల కాలంలోనే కాస్త ఊరట పొందుతున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అరకు లోయలో గల సందర్శనా ప్రాంతాలను వీక్షించడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

శీతాకాలంలో అరకు అందాలను తనివితీరా చూడాల్సిందే
దీంతో ప్రస్తుతం అరకు లోయ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. బొర్రా గుహలు, తడి గూడా కటికి జలపాతంతో పాటు వివిధ సందర్శనా ప్రాంతాలను వీక్షించి పర్యాటకులు మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుంటున్నారు. విశాఖ మన్యంలోని అందాలు, అక్కడి గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి నిష్కల్మషమైన మనస్తత్వం, వారు చేసే వంటలు ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక అరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు ప్రయాణమే అరకు అందాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. మార్గ మధ్యలో ఎన్నో మధురానుభూతులను పంచుతూ రైలు ప్రయాణం అద్భుతంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సీజన్లో చాలా అద్భుత దృశ్యంగా ఉండే అరకును చూడడానికి పర్యాటకులు బాగా ఆసక్తి చూపిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications