Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు జగన్ కు పోలికే లేదు ..ధనికుల కోసమే టీడీపీ : ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ధనిక వర్గాల పార్టీగా అభివర్ణించిన వాసుపల్లి గణేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేదల గుండె చప్పుడు వినే పార్టీగా కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీకి, వైసిపికి చాలా వ్యత్యాసం ఉందని వాసుపల్లి గణేష్ మాట్లాడారు.

జగన్ కు చంద్రబాబుకు అసలు పోలికే లేదన్న వాసుపల్లి గణేష్

జగన్ కు చంద్రబాబుకు అసలు పోలికే లేదన్న వాసుపల్లి గణేష్

ఇటీవల తన ఇద్దరు కుమారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించి, తాను వైసీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించిన వాసుపల్లి గణేష్, వైసీపీలో చేరిన తరువాత మొదటిసారిగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న పలు పథకాలకు మద్దతుగా నేడు అయిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు , జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు.

ధనికుల కోసమే టీడీపీ .. పేదల కోసమే వైసీపీ అన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే

ధనికుల కోసమే టీడీపీ .. పేదల కోసమే వైసీపీ అన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే


ధనికుల కోసమే అన్నట్టు ఆ పార్టీ పని చేసిందని పేర్కొన్న గణేష్ వైసిపి పేదలకోసం, మధ్యతరగతి ప్రజల కోసం పని చేస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖ వన్ టౌన్ లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన గణేష్ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని 16 నెలల పాటు మదన పడ్డానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం ద్వారా తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఏడేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నా అక్కడ డబ్బున్న వాళ్లకి తప్పించి, కష్టపడిన వాళ్ళకు స్థానం లేదని వాసుపల్లి గణేష్ విమర్శించారు.

Recommended Video

    Jagananna Vidya Kanuka పథకానికి శ్రీకారం చుట్టిన CM Ys Jagan, పేద విద్యార్థులకి అండగా..!! | Oneindia
     వైసీపీలోకి రాగానే సముద్రమంత మార్పు కనిపించింది

    వైసీపీలోకి రాగానే సముద్రమంత మార్పు కనిపించింది


    భవిష్యత్తు పై ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు వాసుపల్లి గణేష్. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ,నిధులు దుర్వినియోగం చెయ్యకుండా ప్రజలను సీఎం జగన్ ఆదుకుంటున్నారని, వైయస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే సముద్రమంత మార్పు కనిపించిందని వ్యాఖ్యానించారు వాసుపల్లి గణేష్. టిడిపిలో నగర అధ్యక్షుడుగా నాలుగు సార్లు పని చేశానని చెప్పిన ఆయన వైసీపీలో చేరడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+