AP News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఒంటరైన చిన్నారులు..
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. క్షణిక సుఖం చాలా మంది అడ్డదారి తొక్కుతున్నారు. తమ జీవితాలానే కాకుండా వారి పిల్లల జీవితాలు, కట్టుకున్నోళ్ల జీవితాలను ఆగం చేస్తున్నారు. తాజాగా ఓ వివాహిత తన వివహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హత్య చేసింది. అంతటితో ఆగకుండా హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫల ప్రయత్నం చేసి చివరికి కటకటాల పాలయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై విజయనగరం ఆస్పత్రికి వెళ్లాడు. అతను మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన అతని కుటుంబీకులు రాముకు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కలవలేదు. ఉదయం 6 గంటల సమయంలో రాము తమ్ముడికి ఓ ఫోన్ వచ్చింది. మీ అన్నయ్య కొటారుబిల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద చనిపోయి ఉన్నాడని ఫోన్ లో ఎవరో సమాచారం ఇచ్చారు.

పోలీసులకు ఫిర్యాదు..
కుటుంబీకులు, గ్రామస్థులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో మృతదేహాం ఒకచోట, బైక్ మరోచోట పడి ఉన్నాయి. ముందు రోడ్డు ప్రమాదం జరిగి రాము చనిపోయి ఉంటాడని అంతా భావించారు. అయితే మృతుని తలపై బలమైన గాయాలు గమినించిన అతని సోదరుడు ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అడ్డుగా ఉన్నాడని..
క్లూస్ టీం వచ్చి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది.రాము తమ్ముడు వదిన పై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మృతుడి భార్య ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. రాము భార్య తులసికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై వారిద్దరి మధ్య గొవడలు కూడా జరిగాయి. తమకు రాము అడ్డుగా ఉన్నాడని భావించిన తులసి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకుంది.

ఒంటరైన చిన్నారులు..
ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. విజయనగరం ఆస్పత్రికి రాము వెళ్లిన విషయాన్ని ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఆమె కూడా వెనకాలో బయలేర్దింది. రాము తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు కలిసి కొఠారుబిల్లి గ్రామానికి వెళ్లే జంక్షన్ వద్ద మాటు వేసి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని నమ్మించేందుకు మృతదేహం ఒకచోట, బైక్ మరోచోట పడేసి వెళ్లిపోయారు. తండ్రి మరణం, తల్లి జైలుకెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు ఒంటరిగా మిగిలారు. తల్లి చేసిన పాపానికి ఇప్పుడు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications