ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనంత‌రం గ‌రివిడి, గుర్ల మండ‌లాల‌ను పూర్తిగా చీపురుప‌ల్లి సెగ్మెంట్ లో చేర్చారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో బొత్సా ది ప్ర‌త్యేక ముద్ర‌. ఆయ‌న ఇదే నియ‌జ‌క‌వ‌ర్గం నుండి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. రాష్ట్ర మంత్రిగా..పిసిసి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఎంపీగానూ వ్య‌వ‌హ‌రించారు. 1952 నుండి 1994 వర‌కు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రెండోసారి గెల‌వ‌లేదు. అయితే, ఆ ఒర‌వ‌డికి గ‌ద్దె బాబురావు 1999 లో బ్రేక్ వేసారు. 1994, 1999 లో గ‌ద్దె బాబురావు వ‌ర‌స‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విధంగా 2004, 2009 లో వ‌రుస‌గా బొత్సా గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో బొత్సా కుటుంబానికి చెందిన నలుగురు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వ‌హించ‌టం జిల్లాలో రికార్డు.

14 సార్ల ఎన్నిక‌లు..ఎత్తులు - పైఎత్తులు
చీపురుప‌ల్లి నియోక‌వ‌ర్గం లో 1952 నుండి 2014 వ‌ర‌కు ఇక్క‌డ 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. మూడు సార్లు కాంగ్రెస్‌, టిడిపి ఆరు సార్లు, స్వ‌తంత్ర పార్టీ ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్దులు రెండు సార్లు, కెఎల్‌పి ఒక సారి గెలుపొందారు. విజ‌య‌న‌గ‌రం లోక్‌స‌భ కు 2009 లో ఎన్నికైన బొత్సా ఝాన్సీ ..బొత్సా స‌త్య‌నారాయ‌ణ స‌తీమ‌ణి. బొత్సా స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు అప్పల‌న‌ర్స‌య్య గ‌జ‌ప‌తిన‌గ‌రం నుండి గెలుపొంద‌గా, మేన‌ల్లుడు బి అప్ప‌ల‌నారాయ‌ణ నెల్లిమ‌ర్ల నుండి గెలిచారు. 2014 రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఈ జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. ఇదే జిల్లాలో స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో భాగంగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డి క‌ర్ఫ్యూ సైతం పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

#AndhraPradeshElections2019: All about Cheepurupalli Constituency

2014 లో టిడిపి గెలుపు..బొత్సా ప‌రాజ‌యం
2014 లో చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 189401 ఉండ‌గా, అందులో 153296 మంది ఓటు హ‌క్కు వినియోగిం చుకున్నారు. అందులో టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన కిమ‌డి మృణాళిని కి 63787 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బొత్సా స‌త్య‌నారాయ‌ణ రెండో స్థానంలో నిలిచారు. బొత్సాకు 42945 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, వైసిపి నుండి పోటీ చేసిన చంద్ర‌శేఖ‌ర్ కు 42179 ఓట్లు సాధించి మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో ఇక్క‌డి నుండి గెలిచిన మృణాళిని టిడిపి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. 2017 లో మంత్రివర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా మృణాళిని మంత్రి ప‌ద‌వి కోల్పోయారు. ఆ స్థానంలో ఇదే జిల్లాకు చెందిన సుజ‌య రంగారావు మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+