Pushpa Srivani: వీడియో: థింసా నృత్యం అదుర్స్: డప్పు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
విజయనగరం: ప్రపంచ ఆదివాసిీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయనగరం జిల్లా పార్వతిపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు. విజయనగరం జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి.. స్వయంగా ఈ శాఖను పర్యవేక్షిస్తోన్నందున పార్వతిపురంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది.
పార్వతిపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఆదివాసి ఉత్సవాలకు పుష్ప శ్రీవాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు అలజంగి జోగారావు,కలెక్టర్ సూర్యకుమారి, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి కూడా నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి డప్పుల శబ్దానికి అనుగుణంగా థింసా నృత్యం చేఃశారు. కలెక్టర్ సూర్యకుమారి కూడా వారితో పాదం కలిపారు. పార్వతిపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు డప్పు కొట్టారు.
ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం @PushpaSreevani #worldtribalday #WorldTribalDay2021 #pushpasrivani pic.twitter.com/wDL0m7RDjN
— oneindiatelugu (@oneindiatelugu) August 9, 2021
మరోవంక- ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం, బాక్సైట్ తవ్వకాల అంశాలను ఆయన ప్రస్తావిస్తూ అధికార పార్టీపై పలు ఆరోపణాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామంది ఆదివాసీలు ఉన్నారని, వారిని వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇళ్లను ఖాళీ చేయించే విషయంలో ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ నిలువ నీడలేకుండా చేస్తోందని ఆరోపించారు. అటు విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తోందని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందంటూ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజన సంఘాలు ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దన్నా వైసీపీ మైనింగ్ మాఫియా చేస్తోన్న దోపిడీ ఆగట్లేదని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు అమలులో లేదని చంద్రబాబు అన్నారు. గిరిజన రిజర్వేషన్ల జీవో-3 రద్దు పై ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించట్లేదని చెప్పారు. ఇప్పటికైనా విశాఖపట్నం మన్యంలో మైనింగ్ అక్రమాలను నిలిపివేయడానికి, స్తంభించిపోయిన గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications